భారత్ కు పశ్చిమ దేశాల బిగ్ షాక్...! గుజరాత్ రిఫైనరీకి తొలి దెబ్బ..!
అంతర్జాతీయంగా వేగంగా మారుతున్న పరిణామాలు భారత్ కు తలనొప్పిగా మారాయి. గతంలో అలీన విధానం పేరుతో అన్ని దేశాలతో తటస్థ సంబంధాలు నడిపిన భారత్.. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న నిర్ణయాలు చర్చనీయాంశమవుతున్నాయి. అయినా కేంద్రం వాటి విషయంలో వెనక్కి తగ్గడం లేదు. దీంతో పశ్చిమ దేశాలు భారత్ పై కన్నెర్ర చేస్తున్నాయి. ఓవైపు ట్రంప్ సుంకాల పెంపుతో బెదిరింపులకు దిగుతుండగా.. మరోవైపు నాటో ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు చేస్తోంది. ఇదే క్రమంలో ఐరోపా యూనియన్ భారత్ కు తొలి షాక్ ఇచ్చింది.
ఉక్రెయిన్ పై సుదీర్ఘ కాలం యుద్దం చేస్తూ తలనొప్పిగా మారిన రష్యా దూకుడుకు కళ్లెం వేసే దిశగా పశ్చిమ దేశాలు ఈ మధ్య ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు అండగా నిలుస్తూ తమ ఆర్దిక వ్యవస్థలను కుప్పకూల్చుకోవడం ఇష్టం లేని ఆయా దేశాలు ఇప్పుడు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా రష్యాకు సహకరిస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై ఆంక్షలు తప్పవని తాజాగా నాటో హెచ్చరించింది. అంతకు ముందే ఆయా దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు.

తాజాగా నాటో భాగమైన ఐరోపా సమాఖ్య గుజరాత్ లో ఉన్న నయారా చమురు శుద్ధి కర్మాగారంపై ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా దూకుడుకు కళ్లం వేసే లక్ష్యంతో యూరోపియన్ యూనియన్ నిన్న రష్యన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు ప్రకటించింది. దీంతో రష్యా నుంచి చమురు కొంటున్న గుజరాత్‌లోని వాడినార్‌లో ఉన్న నయారా చమురు శుద్ధి కర్మాగారం పశ్చిమ దేశాల ఆంక్షల పరిధిలోకి వచ్చినట్లయింది. దీంతో ఈ కర్మాగారానికి ఇక పశ్చిమ దేశాల సాయం అందకపోవచ్చని భావిస్తున్నారు.
ఈయూ చర్యపై కేంద్రం సీరియస్ గా స్పందించింది. తమపై ఏకపక్ష చర్యల్ని ఆమోదించబోమని విదేశాంగశాఖ తెలిపింది. తమది బాధ్యతాయుత దేశమని, తమ చట్టపరమైన బాధ్యతలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని వెల్లడించింది. ఇంధన భద్రతపై ద్వంద్వ ప్రమాణాలను అంగీకరించలేమని కూడా తేల్చేసింది. భారత ప్రభుత్వం తన పౌరుల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ఇంధన భద్రతను అందించడం అత్యంత ముఖ్యమైన బాధ్యతగా భావిస్తుందని పేర్కొంది. ముఖ్యంగా ఇంధన వాణిజ్యం విషయానికి వస్తే ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని విదేశాంగశాఖ ప్రతినిధి రణ్ ధీర్ జైశ్వాల్ తెలిపారు.

ఈయూ ఆంక్షల ప్రభావంతో బ్యారెల్ కు 60 డాలర్లుగా ఉన్న రష్యా చమురు ధర పెరిగే అవకాశముంది. అలాగే జీ7 లో సభ్యులు కాని దేశాలు రష్యా చమురు తీసుకోవడానికి పశ్చిమ దేశాల షిప్పింగ్, ఇతర సేవల్ని వాడుకోవడానికి అవకాశం ఉండదు. అలాగే రష్యా నుంచి భారత్ కు చమురు తెచ్చే నౌకల్ని బ్లాక్ లిస్ట్ చేయడం వల్ల రవాణా పరిమాణాల్లో మార్పులు ఉంటాయి. మరోవైపు గుజరాత్ లోని నయారా రిఫైనరీపై ఆంక్షల వెనుక అందులో 49 శాతం భాగస్వామిగా ఉన్న రష్యా సంస్థ రోస్నెఫ్ట్ ను దెబ్బతీయడం ప్రధాన కారణం.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్










Click it and Unblock the Notifications