ఉద్యోగాల వెంట పరుగులు తీయొద్దు: మోహన్ భగవత్‌పై కపిల్ సిబల్ ఫైర్, మోడీ హామీలెక్కడ?
ఉద్యోగాల వెంట యువత పరుగులు తీయొద్దంటూ ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
న్యూఢిల్లీ: ఉద్యోగాల వెంట యువత పరుగులు తీయొద్దంటూ ఇటీవల రాష్ట్రీయ స్వయంసేవక్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలేమయ్యాయని నిలదీశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని ప్రధాని చెప్పారుగా అని ప్రశ్నించారు.
దేశంలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కొరవడినందునే నిరుద్యోగితకు ఓ కారణమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం వ్యాఖ్యానించారు. ఎవరు ఏ వృత్తి, పని చేసినా.. వారిని గౌరవించాలని ఆయన కోరారు. ఈ సందర్బంగానే ఉద్యోగాల వెంట పరుగులు తీయొద్దని మోహన్ భగవత్ సూచించారు.

ముంబైలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మోహన్ భగవత్ మాట్లాడుతూ.. ప్రజలు చేసే పని చిన్నదైనా.. పెద్దదైనా.. వారికి తగిన గౌరవం ఇవ్వాలని కోరారు. ఎందుకంటే ఏ పని అయినా.. సమాజం కోసమేనని చెప్పారు.
Mohan Bhagwat
— Kapil Sibal (@KapilSibal) February 6, 2023
Don’t “chase government jobs”
Where are the private jobs Bhagwat ji ?
And what about the 2crore jobs a year that Modiji promised !
ఈ నేపథ్యంలోనే కపిల్ సిబల్.. మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగాలు వెంట పరుగెత్తవద్దంటే.. మరి ప్రైవేటు ఉద్యోగాలు ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. అంతేగాక, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఏమైందని నిలదీశారు మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications