G20 summit : జీ20 సభ్య దేశాల్లో భారత్ స్ధానమెక్కడ ? కీలక అంశాల్లో ఎక్కడున్నామంటే..
ఢిల్లీ వేదికగా ఈ నెల 9, 10 తేదీల్లో అంతర్జాతీయ జీ20 సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం వివిధ దేశాధినేతలు, ప్రధానులు, ఇతర ప్రతినిధులు రేపటి నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో జీ 20 ఆతిధ్య దేశంగా ఉన్న భారత్.. ఆయా దేశాలతో పోలిస్తే ఏయే అంశాల్లో ముందుంది ? ఏయే అంశాల్లో వెనుకంజలో ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. జీ 20 సభ్య దేశాల్లో భారత్ పలు అంశాల్లో ముందుండగా.. మరికొన్ని అంశాల్లో వెనుకంజలో ఉంది.
దేశ రాజధానిలో జరిగే గ్రూప్ ఆఫ్ 20 సదస్సులో వాతావరణ మార్పు, భౌగోళిక రాజకీయాలు, బహుపాక్షిక సహకారంతో సహా ప్రపంచ అభివృద్ధి సవాళ్లను చర్చించడానికి ప్రపంచ నాయకులు సమావేశం కాబోతున్నారు. 1999లో స్థాపించబడిన ఈ జీ20 గ్రూపులో శాశ్వత సభ్యదేశమైన భారతదేశం.. ఈ ఏడాది తన మొదటి జీ20 సదస్సును నిర్వహిస్తోంది. 20 మంది సభ్యులు అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నారు. ఇందులో భారత్ ఎక్కడ ఉందనేది తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ చైనాను అధిగమించింది. తాజాగా అందుబాటులో ఉన్న గణాంకాల బట్టి చూస్తే భారతదేశం, చైనా ఇద్దరూ కలిపితే జీ20 సభ్యుల మొత్తం జనాభాలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ కలిగి ఉన్నాయి. అలాగే ప్రపంచంలో మూడవ అతిపెద్ద ప్రాంతం కలిగి ఉన్నాయి. ఆ తర్వాత యూరోపియన్ యూనియన్ దాదాపు 9% వాటాను కలిగి ఉంది.
అలాగే జీ20 దేశాల ఆర్ధిక వ్యవస్ధలను పరిశీలిస్తే.. ప్రపంచ బ్యాంక్ డేటా ప్రకారం కొనుగోలు శక్తి సమానత్వ పరంగా జీ20లో భారతదేశం నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ సరళీకరణ నుండి సాపేక్షంగా వేగవంతమైన వృద్ధి ఉన్నప్పటికీ, జీ20 సభ్యుల్లో భారతదేశం ఇప్పటికీ అత్యల్ప తలసరి ఆదాయాన్ని కలిగి ఉంది. చైనా తలసరి ఆదాయం భారతదేశం కంటే రెండింతలు ఎక్కువగా ఉండగా, అమెరికా తలసరి ఆదాయం భారతదేశం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ.

మరోవైపు స్వాతంత్ర్యం తర్వాత గణనీయమైన అభివృద్ధి సాధించినప్పటికీ జీ20 ఆవిర్భావం తర్వాత భారతదేశం రెండవ అతి తక్కువ జీవన ఆయుర్దాయం కలిగి ఉంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా మాత్రమే తక్కువగా ఉండగా జపాన్ అత్యధికంగా ఉంది. భారతదేశం తన జీడీపీలో 3 శాతం మాత్రమే ఆరోగ్యంపై ఖర్చుపెడుతోంది. అమెరికా తన జీడీపీలో 19 శాతం ఆరోగ్యంపై ఖర్చు చేస్తుంది. జీ20 గ్రూపులో కేవలం మూడు దేశాలు మాత్రమే 5% కంటే తక్కువ ఖర్చు చేస్తున్నాయి. అవి భారత్, టర్కీ, సౌదీ అరేబియా.
-
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications