షీనా హత్యకు 3 ప్లాన్‌లు వేసిన ఇంద్రాణి
ముంబై: తన కూతురు షీనా బొరా హత్యకు ఇంద్రాణి ముఖార్జియా మూడు పథకాలు వేసినట్లు తెలుస్తోంది. మొదటి రెండు పథకాలు విఫలమై, మూడో పథకం పారినట్లు చెబుతున్నారు. తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలిసి ఆమె షీనా బొరా హత్యకు పథకాలు వేసినట్లు తెలుస్తోంది.
వార్తకథనాల ప్రకారం - మీడియా ప్రముఖుడు పిటర్ ముఖార్జియా మొదటి భార్యకు పుట్టిన రాహుల్ నివాసానికి షీనా బొరాను రప్పించి హత్య చేయాలనేది వారి మొదటి పథకం. అక్కడ హత్య చేస్తే నేరం రాహుల్‌పై నెట్టివేయవచ్చుననేది వారు ఆలోచన.

షీనా బొరా రాహుల్‌తో సంబంధాలు కొనసాగిస్తుండగా, ఆమె తల్లి వ్యతిరేకిస్తోంది. ఈ మొదటి పథకం విఫలమైతే షీనాను పీటర్ ముఖార్జియా నివాసానికి రప్పించి హత్య చేయాలనేది రెండో పథకం. ఇది పథకం కూడా పారలేదు.
ఆ రెండు పథకాలు పారకపోవడంతో మూడో పథకాన్ని అమలు చేయడానికి ఇంద్రాణీ, సంజీవ్ నిర్ణయించుకుని, ఇందులో డ్రైవర్ శ్యామ్ రాయ్‌ను కూడా చేర్చుకున్నారు. షీనాను హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని రాయగఢ్ అడవుల్లోకి తీసుకుని పారేశారు. ఆ మర్నాడు శవానికి నిప్పంటించారు.












Click it and Unblock the Notifications