Whatsapp Down : నిలిచిపోయిన వాట్సాప్-యూజర్ల గగ్గోలు-ట్విట్టర్ లో మీమ్ ల సందడి..
భారత్ సహా పలుదేశాల్లో ఇవాళ వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాట్సాప్ వాడుతున్న వారికి మెసేజులు రావడం ఆగిపోయింది. అలాగే యూజర్లు పంపుతున్న మెసేజ్ లు కూడా వెళ్లడం లేదు. దీంతో జనం గగ్గోలు పెడుతున్నారు. వాట్సాప్ ఎందుకు నిలిచిపోయిందనే విషయంపై యూజర్లు ట్విట్టర్, ఫేస్ బుక్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు వెళ్లి ఆరా తీస్తున్నారు.
everyone's coming to twitter to see what had happened to whatsapp🤣 #whatsapp pic.twitter.com/0ws29yDehn
— glyano_nstaa (@glyano_) October 25, 2022
నిత్యం కోట్లాది వ్యక్తిగత, గ్రూప్ మెసేజ్ లను యూజర్లు పరస్పరం పంపుకుంటుంటారు. అలాంటిది ఇవాళ ఉదయం కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా జనం మెసేజ్ లు పంపుకుంటున్నారు. కానీ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఒక్కసారిగా మెసేజ్ లు రావడం నిలిచిపోయింది. దీంతో తమ ఫోన్ల సమస్య అని కొందరు అనుకున్నారు. మరికొందరు నెట్ వర్క్ సమస్య అనుకున్నారు. కానీ ఎంత సేపటికీ ఒక్క మెసేజ్ కూడా రాకపోవడంతో అనుమానం వచ్చి ఇతరులకు మెసేజ్ లు పంపేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. ఇదే క్రమంలో వాట్సాప్ వెబ్ సేవలు కూడా నిలిచిపోయాయి. దీంతో రీ కనెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తోంది. దాన్ని క్లిక్ చేసినా ప్రయోజనం లేదు.

వాట్సాప్ సేవలు నిలిచిపోయాయన్న విషయం తెలుసుకున్న నెటిజన్లు.. దీనిపై వివరాలు ఆరా తీసేందుకు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను ఆశ్రయించడం మొదలుపెట్టారు. కానీ ట్విట్టర్ సహా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పైనా దీనికి సంబంధించిన వివరాలు కనిపించలేదు.దీంతో వాట్సాప్ లేకుండా నిమిషం కూడా బతకలేని జనం కాస్తా గగ్గోలు పెడుతున్నారు. వాట్సాప్ ఎప్పుడు తిరిగి వస్తుందని ఆరాలు తీసే పనిలో ఉన్నారు. మరికొందరైతే ఈ ఫ్రస్ట్రేషన్ ను ట్విట్టర్ లో కూడా వ్యక్తం చేస్తున్నారు. వాట్సాప్ ను ఉద్దేశించి ట్విట్టర్ లో మీమ్స్ పెడుతున్నారు. వాట్సాప్ ఏమైందో తెలుసుకునేందుకు ట్విట్టర్ కు వస్తున్నారా వెల్ కమ్ అంటూ కొన్ని మీమ్స్ కనిపిస్తున్నాయి. మరికొన్ని మీమ్స్ లో వాట్సాప్ కు ఏమైందో తెలుసుకునేందుకు ట్విట్టర్ కు పరుగులు తీస్తున్న జనం అంటూ కొన్ని సినిమా ఫొటోలు పెడుతున్నారు.
You came here to see if Whatsapp is down right? pic.twitter.com/Vwx1urd3BS
— 0xShane (@BeLikeShane) October 25, 2022












Click it and Unblock the Notifications