మోడీకి వ్యతిరేక నినాదాలొద్దు: సోనియా ఆదేశం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేయవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ తమ పార్టీ సభ్యులకు సూచించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరి రోజున కాంగ్రెస్ సభ్యుడు అధీర్ రంజన్ చౌదరి సభ మధ్యలో నిల్చుని ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చేశారు.
దీంతో ప్రతిపక్ష బెంచీల వైపు ముందు వరుసలో కూర్చున్న సోనియా గాంధీ ఇది గమనించి వెంటనే వెళ్లి చౌదరిని వారించారు. అవినీతికి వ్యతిరేకంగా నినాదాలు చేయాలే తప్ప, ప్రధాని పేరును ఎత్తకూడదని చెప్పారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యులెవరూ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేయలేదు.
కాగా, ఇటీవల సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక నివాసంలో తేనేటీ విందు ఇచ్చిన విషయం తెలిసిందే.

పరిశీలనలో దత్తత తల్లులకు ప్రసూతి సెలవుల అంశం!
దత్తత తల్లులకు 16 వారాల ప్రసూతి సెలవులు ఇచ్చే అంశంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. మూడు నెలల వరకూ వయసున్న చిన్నారులను న్యాయబద్ధంగా దత్తత తీసుకునే మహిళలకు మాత్రమే ఈ సెలవులు దొరికే వీలుంది. సంబంధిత వివరాలను రాజ్యసభకు కేంద్ర కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ బుధవారం వెల్లడించారు.
ప్రసూతి సెలవులను ప్రస్తుతమున్న 12వారాల నుంచి 26వారాలకు పెంచే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. అద్దె గర్భం ద్వారా తల్లి అయ్యేవారికి సైతం 16వారాల ప్రసూతి సెలవులిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవిషయంపై వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చలు జరిపినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications