ఢిల్లీ సీఎం కోసం సర్‌ప్రైజ్ క్యాండిడేట్

Chandrababu: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్‌లీలా మైదాన్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి, మంత్రులూ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదివరకే ఆహ్వానం అందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు అయినందున తెలుగుదేశం, జనసేన పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు.

Who is Delhi CM Newly elected BJP MLAs will convene at 6 15 pm to elect their leader

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బిహార్ ముఖ్యమంత్రులు దీనికి హాజరు కానున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమామాలిని, కిరణ్ ఖేర్ దీనికి హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది ఇంకా తేలట్లేదు. నేడు ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించనుంది. ఈ సాయంత్రం 6:15 నిమిషాలకు బీజేపీ శాసనసభా పక్షం భేటీ కానుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తమ అధినాయకుడిని ఎన్నుకుంటారు. ఈ భేటీకి కేంద్ర పరిశీలకులుగా రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్‌కర్ హాజరు కానున్నారు.

కొత్త సీఎంగా పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, రేఖా గుప్తా పేర్లు వినిపిస్తోన్నాయి. మొన్నటి ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి.. జెయింట్ కిల్లర్‌గా ఆవిర్భవించారు పర్వేష్ వర్మ. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తనయుడు సాహిబ్ సింగ్ వర్మ తనయుడే ఈ పర్వేష్. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. బీజేపీ హైకమాండ్ టాప్ ప్రయారిటీ ఆయనే.

ఆయన తరువాత విజేందర్ గుప్తా, రేఖా గుప్తా పేర్లు వినిపిస్తోన్నాయి. ఈ ఇద్దరు నాయకులు కూడా బనియా (వైశ్య) సామాజిక వర్గానికి చెందిన వాళ్లు. మహిళను ముఖ్యమంత్రి చెయ్యాలీ అని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించుకుంటే రేఖా గుప్తాకే అవకాశం దక్కుతుంది. శిఖా రాయ్, బాన్సురీ స్వరాజ్ పేర్లు కూడా పరిశీలనలోకి తీసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+