పార్టీ, భవిష్యత్తుపై అజిత్‌కు చెప్పిన జయలలిత, వారసుడిగా వీలునామా!
చెన్నై: అనారోగ్యానికి గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తన రాజకీయ వారసుడిని ఎప్పుడో ఎంపిక చేసుకున్నారని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఆమె తన వీలునామాలో ఆ విషయం పేర్కొన్నారని అంటున్నారు.
ఇందుకు సంబంధించి తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. జయను కన్నతల్లిలా భావించే హీరో అజిత్ కుమారే ఆమె వారసుడు అని తమిళనాడు కోడై కూస్తోంది. కొన్ని వార్తా సంస్థలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి.
హీరోగా ప్రజల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న అజిత్.. వివాదరహితుడు, సేవాతత్పరుడు. జయలలితను కన్నతల్లిగా భావిస్తారు. ఇదే విషయాన్ని పలు వేదికల పైన చెప్పారు.

ఆసుపత్రిలో చేరడానికి కొద్ది రోజుల ముందే అజిత్‌ను జయలలిత ఇంటికి పిలిపించుకున్నారని, పార్టీ పరిస్థితులు, భవిష్యత్తు నిర్మాణం తదితరాల పైన చర్చించారని ప్రచారం సాగుతోంది. అన్ని విషయాలు ఆలోచించిన తర్వాతనే జయ.. అజిత్‌ను వారసుడిగా ఎంపిక చేసిందనే ప్రచారం సాగుతోంది.
ఈ మేరకు వీలునామా రాశారని, ఇప్పుడు ఆ విలునామా జయకు అత్యంత నమ్మకస్తులైన వారి దగ్గర ఉందనే చర్చ సాగుతోంది. అజిత్ ఎంపిక పార్టీలోని పెద్దలందరికీ సమ్మతమేనని తెలుస్తోంది. గతంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన పన్నీరు సెల్వం పట్ల వ్యతిరేకత లేనప్పటికీ.. భవిష్యత్తులో ఎన్నికల్లో బలమైన ప్రత్యర్థిని ఢీకొట్టేందుకు అవసరమైన ప్రజాధరణ అజిత్‌కు ఉన్నందునే మొగ్గు చూపారని అంటున్నారు.












Click it and Unblock the Notifications