భారత్‌లో బ్లాస్టింగ్స్ అన్నీ ఆ సమయంలోనే.. కారణం ఇదేనా ???
భారత్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పేలుడు ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. లేటెస్ట్ గా ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడులో సుమారు 12 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్ తన సహచరులు అరెస్ట్ కావడంతో భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
అంతే కాకుండా ఈ ఘటనకు ఫరీదాబాద్‌లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో ముడిపడి ఉన్నట్లు భద్రతా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఫరీదాబాద్‌లోని తన సహచరులు డా. ముజామిల్ షకీల్, డా. ఆదీల్ అహ్మద్ రథర్ అరెస్టు కావడంతో ఉమర్ భయాందోళనకు గురై ఈ ఘటనకు పాల్పడినట్టు భావిస్తున్నారు. తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలపై ఆందోళన చెంది తాను కూడా పట్టుబడతాననే భయంతో ఆత్మహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.

కాగా సంఘటన జరిగిన సమయంలో అసంపూర్తిగా ఉన్న ఐఈడీ బాంబును మరోచోటుకు తరలిస్తుండగా లేదా దానిని రోడ్డుపై విసిరేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, డిటోనేటర్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం డా. ఉమర్ మృతదేహాన్ని ధృవీకరించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
అయితే ఈ వరుస పేలుళ్ల ఘటనల్లో మాత్రం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే సమయం అనే చెప్పాలి. గత ఘటనలు, తాజాగా జరిగిన పేలుడు లను పరిశీలిస్తే సాయంత్రం సమయంలోనే ఈ దుర్గతనలు ఎక్కువగా చోటు చేసుకున్నట్టు స్పష్టం అవుతోంది. గత రెండు దశాబ్దాలుగా ఉగ్రవాద దాడులను పరిశీలిస్తే.. చాలావరకు పేలుళ్లు సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యే జరిగాయి. ఇప్పుడు ఢిల్లీ కారు బాంబు దాడిలో కూడా నిందితుడు మధ్యాహ్నం నిర్దేశించిన ప్రాంతానికి చేరుకున్నప్పటికీ.. సాయంత్రం వరకు వేచి చూసి ఘటనకు పాల్పడినట్టు స్పష్టం అవుతోంది.
కారణం ఇదే..?
అయితే ఈ దాడుల వెనుక ప్రధానంగా భారీ విధ్వంసం సృష్టించడం, ప్రజల్లో భయాన్ని కలిగించడం, ప్రభుత్వాలను బలహీనపరచడం, మీడియా, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. ఎక్కువ మంది మరణించినప్పుడే ప్రభావం ఎక్కువగా ఉంటుందని.. అందుకోసం సాయంత్రం 6 నుండి 7 గంటల సమయం వారికి అనుకూలమైనదిగా ఎంచుకుంటున్నట్టు అనుమానిస్తున్నారు. ఆ సమయంలోనే ఉద్యోగులు, విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వస్తుండడం, ఇళ్లలోని వారు బయటకు రావడం కూడా జరుగుతుంది. ప్రధాన కూడళ్లు, మార్కెట్లు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాలు సైతం ఆ సమయంలోనే జనసందోహంతో నిండి ఉండడం కూడా ఈ పన్నాగానికి ఉపకరిస్తున్నాయి.

అంతే కాకుండా చీకటి పడుతున్న తరుణంలో సీసీ కెమెరాల నుంచి కూడా తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల పోలీసులు వాహనాల తనిఖీలు చేయడానికి అవకాశం తక్కువ ఉంటుంది. ఈ అంశాలన్నీ ఉగ్రవాదులకు తమ దాడులను అమలు చేయడానికి అనుకూలంగా మారుతున్నట్టు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
భారత్‌లో సాయంత్రం వేళల్లో జరిగిన ప్రధాన పేలుళ్ల వివరాలు..
- తేది - ప్రాంతం - పేలుళ్లు సమయం- మరణాలు
- 29-10-2005 - ఢిల్లీ - 3 - సా.5.45, 6, 6.05 - 70
- 07-03-2006- వారణాసి - 2 - సా. 6.20 - 28
- 11-07-2006 - ముంబై - 7- సా. 6.24 నుంచి - 209
- 25-08-2007 - హైదరాబాద్ - 2 - సా. 7.45, 7.50 - 42
- 13-05-2008 - జైపూర్ - 9 - సా. 7.30 - 63
- 26-07-2008 - అహ్మదాబాద్ - 21 - సా. 6.30 నుండి - 51
- 13-09-2008 - ఢిల్లీ - 5 - సా. 6.07 నుండి - 25
- 13-02-2010 - పుణే - 1 - సా. 7.15 - 17
- 07-12-2010 - వారణాసి 1 - సా. 6.30 - 33
- 21-02-2013 - హైదరాబాద్ - 2- సా. 6.58, 7.01 - 17
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications