మావోయిస్టు అగ్రనేత అరవింద్ గుండెపోటుతో మృతి

రాంచీ: మావోయిస్టు పార్టీ అగ్రనేత అరవింద్ గుండెపోటుతో మరణించారు. జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టు కార్యక్రమాల్లో అరవింద్‌ కీలకపాత్ర పోషించారు. ఆయనపై పలు కేసులున్నాయి. అరవింద్‌పై సుమారు రూ.కోటి రూపాయాల రివార్డు ఉంది. అరవింద్ మృతి మావోయిస్టు పార్టీకి తీరని నష్టంగా ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

గుండెపోటు కారణంగా అరవింద్ మరణించడం రెడ్ కారిడార్‌లో మావోయిస్టు పార్టీకి తీరని నష్టమేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మావోయిస్టు అగ్రనేతగా ఉన్న అరవింద్ అలియాస్ దేవ్‌కుమార్ సింగ్ మరణించడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొంటున్నారు.

Why Devkumar Singh alias Arvindjis death is a major blow to Maoists

అరవింద్‌ ఏ కేటగిరి నక్సల్స్ జాబితాలో ఉన్నారు. ఆయనపై ప్రభుత్వం రూ.1.5 కోట్ల రివార్డును ప్రకటించింది. జార్ఖండ్ రాష్ట్రంలోని పలు అడవులపై అరవింద్‌కు మంచి పట్టుంది. బుదపహర్ ప్రాంతంలో అరవింద్ కదలికలను పోలీసులు గతంలో పలు సందర్భాల్లో పసిగట్టాయి. అయితే ఆయన పోలీసుల నుండి తప్పించుకొన్నారు.

ఉన్నతవిద్యను అభ్యసించిన అరవింద్ టెక్నాలజీలో నిపుణుడిగా మావోయిస్టు పార్టీలో పేరుంది. 50 ఏళ్ళకు పైగా వయస్సున్న అరవింద్ ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులోని జార్ఖండ్ బుధపహద్ అడవుల్లో గుండెపోటుతో మరణించాడు.

సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు భద్రతా దళ సిబ్బందిని హతమార్చడం, దాడులకు పాల్పడటం వంటి పలు కేసుల్లో అరవింద్‌ ప్రమేయం ఉంది. బీహార్‌లోని జెహనాబాద్‌కు చెందిన అరవింద్‌జీ జార్ఖండ్‌లోని మావో ప్రభావిత పలము, గర్హ్వ, ఛత్ర జిల్లాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+