Omicron Virus : గుడ్ న్యూస్- దేశంలో పరిమిత వ్యాప్తి-అన్నీ మైల్డ్, లక్షణాల్లేని కేసులే-కారణాలివే
దక్షిణాఫ్రికాతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రభావం చూపుతున్న ఓమిక్రాన్ వైరస్ పై అంతర్జాతీయంగా భయాందోళనలు నెలకొంటున్నాయి. భారత్ లో సైతం ఇలాంటి ఆందోళనలే నెలకొన్నాయి. కానీ తాజాగా వీటిని విశ్లేషిస్తున్న నిపుణులు మాత్రం భారత్ లో కేసులు అన్నీ తేలికోపాటివేనని, లక్షణాల్లేకుండా గుర్తిస్తున్నవే అని తేల్చారు. దీంతో వీటి తీవ్రత తక్కువేనని తెలుస్తోంది. అదే సమయంలో దేశంలో ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో కూడా తెలియడం లేదంటున్నారు.

ఓమిక్రాన్ భారత్ లో ఓమిక్రాన్ కేసులు
భారత్ లో ఓమిక్రాన్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, గుజరాత్ లో ప్రధానంగా ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో సైతం అనుమానితుల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షిస్తున్నారు. వీటిలో పలువురు ఓమిక్రాన్ బారిన పడి ఉండొచ్చనే అనుమానాలు నెలకొంటున్నాయి. పూనే ల్యాబ్ లో జరుగుతున్న పరీక్షలు పూర్తయితే కానీ ఎంత మందికి ఈ వైరస్ సోకిందనే విషయంపై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశాల్లేవు. దీంతో భారత్ లో ఓమిక్రాన్ ముప్పుపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేని పరిస్ధితి.

తేలికపాటి, లక్షణాల్లేని కేసులు
భారత్ లో ఇప్పటిదాకా నమోదైన ఓమిక్రాన్ కేసుల్ని నిర్ధారిస్తున్న వైద్య నిపుణులు ఓ క్లారిటీ మాత్రం ఇచ్చేస్తున్నారు. ఈ కేసులన్నీ తేలికపాటి (మైల్డ్), లక్షణాలు లేనివిగానే గుర్తించారు. అంటే ఇవి రోగులపై తీవ్ర ప్రభావం చూపడం లేదని, అలాగే వీటి లక్షణాలు కూడా బయటికి కనిపించడం లేదని తేల్చారు. తద్వారా అనుమానితుల్ని పరీక్షించినప్పుడు మాత్రమే ఇవి బయటపడుతున్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు అనుమానితులు కాని వారి పరిస్ధితి ఏంటన్నది సస్పెన్స్ గా మారుతోంది. ఏదో ఒక విధంగా పరీక్షలు చేస్తే తప్ప ఓమిక్రాన్ ఉనికి గుర్తించే పరిస్ధితి లేదు. అదీ సాధారణ పరీక్షలు కాకుండా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తే తప్ప ఓమిక్రాన్ కేసులు వెలుదుచూడడం లేదు.

భారత్ లో ముప్పు తక్కువే
ఇప్పటివరకూ లభించిన ఆధారాల్ని బట్టి చూస్తే భారత్ పై ఓమిక్రాన్ ముప్పు తక్కువేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఓమిక్రాన్ కేసులు వెలుగుచూస్తున్న ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా వ్యాపించిన ఆధారాలు కనిపించడం లేదు. ప్రపంచ దేశాల్లో వ్యాపించిన వైరస్ తో పోలిస్తే భారత్ లో ఓమిక్రాన్ వైరస్ తక్కువ తీవ్రత కలిగిందిగా గుర్తించారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఆరంభంలో చేసిన హెచ్చరికల స్ధాయి తీవ్రత లేదని తేలిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న తక్కువ కేసుల్నీ త్వరగా తేల్చి వాటికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తోంది.

అసలు కారణాలివే
డెల్టా వేరియంట్‌తో పోలిస్తే కొత్త కోవిడ్-19 వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. ఇది కొంతవరకు కొత్త వేరియంట్ యొక్క స్వభావం వల్ల, కొంతవరకు భారతీయుల సీరో పాజిటివిటీ అధిక రేటు కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా పెద్ద నగరాల్లో 90% మంది శరీరాల్లో ఇప్పటికే రోగనిరోధకాలు అభివృద్ధి చెంది ఉన్నాయి. మన దేశంలోని జనాల్లో పెరిగిన 70, 80 శాతం సీరో పాజిటివిటీ రేటే ఇప్పుడు పనికొస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మెట్రో నగరాల్లో అయితే 90 శాతం కంటే ఎక్కువ మంది ఇప్పటికే రోగ ప్రతిరోధకాలను కలిగి ఉన్నారని ఐసీఎంఆర్ తాజాగా విశ్లేషించింది.












Click it and Unblock the Notifications