వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమారస్వామి సీఎంగా ప్రమాణం: ఆ ముగ్గురు గైర్హాజర్, అందరి దృష్టి నవీన్‌పైనే, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్యమంత్రిగా జెడి(ఎస్) నేత కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి బిజెడి నేత, ఒడిశా ముఖ్యమంత్రి గైరాజరయ్యారు. త్వరలో ఒడిశాలో కూడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఏ కూటమికి వ్యతిరేకంగానో, అనుకూలంగానో వ్యవహరించకూడదనే ఉద్దేశ్యంతోనే నవీన్ పట్నాయక్ కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవానికి రాలేదనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి బిజెపియేతర పార్టీల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు హజరయ్యారు. పలువురు సీఎంలు, ఆయా పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి బిజెడి చీఫ్ నవీన్ పట్నాయక్ ఈ కార్యక్రమానికి రాకపోవడంపైనే ఎక్కువగా చర్చ సాగుతోంది. ఆ పార్టీకి చెందిన ప్రతినిధులు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొనకపోవడం గమనార్హం.

ఆ ముగ్గురు గైరాజర్

ఆ ముగ్గురు గైరాజర్

కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రాంతీయ పార్టీల నుండి ముగ్గురు పార్టీల నేతలు హజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కెసిఆర్, కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హజరుకాలేదు. కానీ, మే 22వ తేది రాత్రే కెసిఆర్ బెంగుళూరుకు వెళ్ళి దేవేగౌడను కుమారస్వామిని కలిశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కుమారస్వామిని అభినందించి వచ్చారు. మరోవైపు డిఎంకె చీఫ్ స్టాలిన్, బిజెడి చీఫ్, ఒడిశా సీఎ: నవీన్ పట్నాయక్ లు గైరాజరయ్యారు. తుత్తుకూడిలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో రాలేనని స్టాలిన్ కుమారస్వామికి సమాచారం పంపారని సమాచారం. అయితే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మాత్రం ఎందుకు హజరుకాలేదనేది ప్రస్తుతం చర్చసాగుతోంది.

 నవీన్ పట్నాయక్ ఎందుకు రాలేదు

నవీన్ పట్నాయక్ ఎందుకు రాలేదు

జెడి(ఎస్) నేత కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గైరాజరయ్యారు. బిజెపియేతర పార్టీల వేదికగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం సాగింది. ఈ తరుణంలో నవీన్ పట్నాయక్ హజరుకాకపోవడం ప్రధానంగా చర్చ సాగుతోంది. ఢిల్లీ తరహా రాజకీయాలపై బిజెపి నేత నవీన్ పట్నాయక్ ఆసక్తిని చూపడం లేదని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు. ఇది కూడ ఓ కారణమనే అభిప్రాయం కూడ లేకపోలేదు.

ఒడిశా పరిస్థితులు కారణమేనా

ఒడిశా పరిస్థితులు కారణమేనా

ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులు కూడ నవీన్ పట్నాయక్ కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరుకాకపోవడం కూడ కారణమనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 18 ఏళ్ళుగా ఒడిశాలో బిజెడి అధికారంలో ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలో బిజెపి పుంజుకొంటుంది. ఇటీవల జరిగిన గ్రామపంచాయితీ ఎన్నికల్లో బిజెపి గణనీయంగా స్థానాలను కైవసం చేసుకొంది. ఎన్నికలు రానున్న తరుణంలో బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ఒక్కటి కావాలనే ప్రయత్నంలో కంటే దూరంగా ఉండాలనే అభిప్రాయంతోనే కుమారస్వామి ప్రమాణస్వీకారానికి నవీన్ పట్నాయక్ దూరంగా ఉండి ఉండవచ్చనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

ఆ పార్టీలకు సమదూరమా

ఆ పార్టీలకు సమదూరమా

ఒడిశా రాష్ట్రంలో మైనింగ్ కుంభకోణం, చిట్‌ఫండ్ కుంభకోణాల్లో కొందరు బిజెడి నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై సిబిఐ విచారణలు సాగుతున్నాయి.. ఈ తరుణంలోనే బిజెపికి వ్యతిరేకంగా నవీన్ పట్నాయక్ బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ కు నవీన్ పట్నాయక్ దగ్గరౌతున్నారని ఆ రాష్ట్ర బిజెపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఈ రెండు పార్టీలకు సమదూరం పాటించాలనే ఉద్దేశ్యంతోనే నవీన్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

English summary
Odisha Chief Minister and Biju Janata Dal (BJD) supremo Naveen Patnaik will be among the few opposition leaders conspicuous by their absence at the swearing-in ceremony of HD Kumaraswamy in Bengaluru on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X