‘విడో ప్రొటెక్షన్ బిల్లు’: ప్రధానికి వితంతువుల విజ్ఞప్తి
బృందావనం: ‘విడో ప్రొటెక్షన్ బిల్లు'ను ప్రవేశపెట్టాలని బృందావన్, వారణాసికి చెందిన వితంతువులు ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రపంచ వితంతువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వితంతువులంతా పెద్ద ఎత్తున వితంతు పునరావాస గృహం వద్దకు చేరుకున్నారు.
దురదృష్టవశాత్తు వివిధ కారణాలతో భర్తలను కోల్పోయి దిక్కుమొక్కూ లేకుండా ఎన్నో ఇబ్బందులెదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకునేందుకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వితంతు సంరక్షణా బిల్లును ప్రవేశపెట్టాలని వితంతువులంతా ప్రధానిని కోరారు.

సులభ్ మూవ్‌మెంట్ ఛాంపియన్ బిందేశ్వర్ పాఠక్ ఆధ్వర్యంలో వితంతువులు తమకు రక్షణ కల్పించాలని విజ్జప్తి చేశారు. లక్షల సంఖ్యలో నిరాశ్రయులవుతున్న వితంతువులను రక్షించాలని కోరారు.
పేదరికం, నిరాదరణతో వితంతువులు ఆశ్రయం కోల్పుతున్నారని, తిండి కూడా లేకుండా జీవితాలు వెల్లదీస్తున్నారని ప్రధానికి విన్నవించారు. ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటు చేసి వితంతువుల, వృద్ధుల యోగక్షేమాలను పర్యవేక్షించాలని బిందేశ్వర్ పాఠక్ కోరారు.
త్వరలోనే ప్రధాని మోడీని ఈ విషయంపై కలుస్తామని ఆయన చెప్పారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే వితంతువుల రక్షణ బిల్లును ప్రవేశపెట్టాలని కోరతామని తెలిపారు.












Click it and Unblock the Notifications