Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: కొడుకుతో కలిసి భర్తను చంపేసి శవాన్ని ముక్కలు నరికేసిన భార్య, చెరువులో తల తేలింది !

కోల్ కత్తా/న్యూఢిల్లీ: భారత నౌకాదళంలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. స్వచ్చందంగా పదవి విరమణ చేసిన ఆయన ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నాడు. భార్య, కుమారుడితో కలిసి సిటీ సమీపంలో నివాసం ఉంటున్నారు. నౌకాదళం మాజీ మాజీ అధికారి ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. ఉదయం ఆయన భార్య, కుమారుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి నా భర్త కనపడటం లేదని కేసు పెట్టారు. మూడు రోజుల తరువాత చెరువులో నౌకాదళం మాజీ అధికారి తల మాత్రం తేలింది. నౌకాదళం మాజీ అధికారిని ఆయన భార్య, కుమారుడు కలిసి హత్య చేసి అతని శవాన్నిముక్కలు ముక్కలుగా నరికేశారని వెలుగు చూడటం కలకలం రేపింది.

రిటైడ్ అయిన అధికారి

రిటైడ్ అయిన అధికారి

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కత్తా సిటీ సమీపంలోని షారుయ్ పూర్ ప్రాంతంలో ఉజ్వల్ చక్రవర్తి అలియాస్ ఉజ్వల్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 30 సంవత్సరాల క్రితం ఉజ్వల్ శ్యామిలి (50) అనే మహిళను వివాహం చేసుకున్నాడు. భారత నౌకాదళంలో ఉద్యోగం చేస్తున్న ఉజ్వల్ కొన్ని సంవత్సరాల క్రితం స్వచ్చందంగా పదవి విరమణ చేశారు.

భార్య, కుమారుడితో నివాసం

భార్య, కుమారుడితో నివాసం

ఉజ్వల్, శ్యామిలీ దంపతులకు రాజు (27) అనే కుమారుడు ఉన్నాడు. రిటైడ్ అయిన తరువాత ఉజ్వల్ కోల్ కత్తా సిటీ సమీపంలోని షారుయ్ పూర్ ప్రాంతంలో అతని భార్య శ్యామిలీ, కుమారుడు రాజు కలిసి నివాసం ఉంటున్నాడు. కోల్ కత్తాలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉజ్వల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నాడు.

మిస్సింగ్ కేసు పెట్టిన భార్య

మిస్సింగ్ కేసు పెట్టిన భార్య

ఈనెల 15వ తేదీన ఉదయం శ్యామిలీ, ఆమె కుమారుడు రాజు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్లి వస్తున్న ఉజ్వల్ రాత్రి ఇంటికి రాలేదని, మాకు భయంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల తరువాత ఓ చెరువులో భారత నౌకాదళం మాజీ అధికారి ఉజ్వల్ తల మాత్రం నీలల్లో తేలింది.

ఏమాత్రం ఫీలింగ్ లేదు

ఏమాత్రం ఫీలింగ్ లేదు

నౌకాదళం మాజీ అధికారి ఉజ్వల్ భార్య శ్యామిలీ, కుమారుడు రాజును చెరువు దగ్గరకు పిలిపించి వివరాలు సేకరించారు. హత్యకు గురైయ్యింది ఉజ్వల్ అని అతని భార్య శ్యామిలీ, కుమారుడు రాజు అని పోలీసులకు చెప్పారు. అయితే భర్త హత్యకు గురైనాడని శ్యామిలీకి కాని. ఉజ్వల్ ను చంపేశారని అతని కుమారుడు రాజుకు ఏమాత్రం భాదలేకుండా మామూలుగా ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

అసలు మ్యాటర్ చెప్పిన భార్య

అసలు మ్యాటర్ చెప్పిన భార్య

పోలీసులు శ్యామిలీ, రాజును అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యగా అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. భారత నౌకదాళం రిటైడ్ అధికారి ఉజ్వల్ మద్యంకు బానిస అయ్యాడని పోలీసులు అన్నారు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న ఉజ్వల్ అతని భార్య శ్యామిలీని చితబాదేసేవాడని అతని కుమారుడు రాజు పోలీసులకు చెప్పాడు.

చంపేసి శవాన్ని ముక్కలు చేసిన భార్య, కొడుకు

చంపేసి శవాన్ని ముక్కలు చేసిన భార్య, కొడుకు

కుమారుడు రాజును ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని తన భర్త ఉజ్వల్ టార్చర్ పెట్టేవాడని శ్యామిలీ పోలీసులకు చెప్పారు.

ఈనెల 14వ తేదీ రాత్రి తన తండ్రి ఉజ్వల్ తన తల్లిని చితకబాదేశాడని, ఆ సందర్బంలో తాను తండ్రి మీద దాడి చేస్తే అతను కిందపడిపోయాడని, తాను గొంతు కోసి తన తండ్రి ఉజ్వల్ ను చంపేశానని రాజు పోలీసులకు చెప్పాడు. ఉజ్వల్ ను హత్య చేసిన తరువాత సాక్షాలు చిక్కకూడాదని అతని కాళ్లు, చేతులు, తల, శరీరం ముక్కలు ముక్కలు చేశారు.

చెరువులో, పొదల్లో శరీరం ముక్కలు విసిరేసి డ్రామాలు

చెరువులో, పొదల్లో శరీరం ముక్కలు విసిరేసి డ్రామాలు

శరీరంలోని ముక్కలు పాలథిన్ కవర్లలో వేసుకుని ఐదు కిలోమీటర్ల దూరం వెళ్లి చెరువులో, పొదల్లో ఆ ముక్కలు విసిరేశామని భార్య శ్యామిలీ, కుమారుడు రాజు చెప్పారని పోలీసులు అన్నారు. భర్త ఉజ్వల్ ను హత్య చేసిన తరువాత శ్యామిలీ కొడుకు రాజుతో కలిసి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తన భర్త కనపడటం లేదని నాటకాలు ఆడిందని పోలీసులు అన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రియుడు హఫ్తాబ్ అతని ప్రియులు శ్రద్దాను హత్య చేసి ఆమె శవాన్ని 35 ముక్కలుగా నరికేసిన తరువాత ఇలాంటి కేసులు వెలుగు చూడటంతో సామాన్య ప్రజలు హడలిపోతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+