Wife: పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య, కోపంతో కూతుర్ని చంపేసి రెండో భర్త ఏం చేశాడంటే ?
చెన్నై/నాగై: వివాహం చేసుకున్న మహిళ కొన్ని సంవత్సరాలు ఆమె భర్తతో కాపురం చేసింది. కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో ఆమె మరో యువకుడిని పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేసిన మహిళకు ఓ కుమార్తె ఉంది. తరువాత దంపతుల మద్య గొడవలు జరగడంతో భర్తతో విడిపోయిన మహిళ పుట్టింటిలో ఉంది. భార్య మీద కోపంతో రెండో భర్త ఆవేశంలో కిరాతకుడిలా ప్రవర్తించాడు. కూతుర్నిహత్య చేసిన తండ్రి అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

రెండో పెళ్లి చేసుకున్న మహిళ
తమిళనాడులోని నాగపట్నం జిల్లా (నాగై జిల్లా)లోని తిరుమరుకలై సమీపంలోని మేలిరుపు గ్రామంలో దీపా అనే మహిళ నివాసం ఉంటున్నది. దీపా భర్త చనిపోయాడు. ఆరు సంవత్సరాల క్రితం దీపా మారిముత్తు అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేసిన దీపా ఓ కుమార్తెకు తల్లి అయ్యింది.

రెండో భర్తతో గొడవలు....పుట్టింటికి వెళ్లిపోతున్న భార్య
కూతురి పేరు రుద్రా అని పెట్టారు. మారిముత్తు, దీపా దంపతులు కుమార్తె రుద్రాతో కలసి నివాసం ఉంటున్నారు. సంవత్సరం నుంచి మారిముత్తు ,దీపా దంపతుల మద్య గొడవలు జరుగుతున్నాయి. రెండో భర్త మారిముత్తుతో గొడవపడిన ప్రతిసారి దీపా ఆమె పుట్టింటికి వెళ్లిపోవడం, తరువాత రెండో భర్త వెళ్లి ఆమెను బుజ్జగించి తీసుకురావడం చేస్తున్నాడు.

నేనురాను అని తేల్చి చెప్పిన భార్య
వారం రోజుల క్రితం భర్త మారిముత్తుతో గొడవపడిన దీపా ఆమె కూతురు రుద్రాను పిలుచుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. మూడు రోజుల క్రితం మారిముత్తు భార్య పిలుచుకుని రావడానికి దీపా ఇంటికి వెళ్లాడు. నేను నీతోరానని తేల్చి చెప్పింది. కూతురు రుద్రాను పిలుచుకుని మారిముత్తు అతని ఇంటికి వెళ్లిపోయాడు.

కూతుర్ని చంపేసి ఆత్మహత్య
రెండు రోజుల నుంచి కూతురు రుద్రా తల్లి కావాలని ఎడుస్తోంది. కూతురి బాదచూడలేక మారిముత్తు అతని భార్య దీపాకు ఫోన్ చేసి కుతుర్ని పిలుచుకుని వెళ్లడానికి బస్ స్టాండ్ దగ్గరకు రావాలని చెప్పాడు. అయితే దీపా నేను రాను అని కచ్చితంగా చెప్పింది. కోపంతో ఫోన్ కట్ చేసిన మారిముత్తు నేరుగా ఇంటికి వెళ్లి కూతురు రుద్రాకు ఉరి వేసుకుని హత్య చేసి మరో బెడ్ రూమ్ లో అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దీపా మీద కోపంతో మారిముత్తు అతని కూతుర్ని హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తరువాత తీరికగా భార్య ఆమె భర్త మారిముత్తు ఇంటికి వెళ్లింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications