పనిమనిషి మృతి: పోలీసుల అదుపులో ఎంపి భార్య

Wife of BSP MP detained for killing domestic help
న్యూఢిల్లీ: బిఎస్పీ పార్లమెంటు సభ్యుడు ధనంజయ్ సింగ్ భార్య జాగృతి సింగ్‌ను న్యూఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పని మనిషి మృతి సంఘటనపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. విపరీతంగా కొట్టడం వల్లనే పని మనిషి మరణించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

గత పది నెలలుగా పని మనిషిని జాగృతి సింగ్ విపరీతంగా వేధిస్తోందని, హింసకు గురి చేస్తోందని ఆరోపణలు వచ్చాయి. పని మనిషి న్యూఢిల్లీలోని చాణక్యపురిలో గల ఎంపి భార్య నివాసంలో పని మనిషి అనుమానాస్పద స్థితిలో మరణించింది.

పని మనిషి తలపై, ఛాతీపై, కడుపులో, చేతులపై విపరీతంగా కొట్టినట్లు గుర్తులున్నాయని అంటున్నారు. భార్యతో విడాకుల కోసం తాను దరఖాస్తు చేసుకున్నానని, తాను వేరే నివాసంలో ఉంటున్నానని ఎంపి ధనంజయ్ సింగ్ చెప్పారు. పని మనిషి మృతి గురించి ఫోన్‌లో తన భార్య తనకు చెప్పిందని, ఆ సమయంలో తాను ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గం జౌన్పూర్‌లో ఉన్నానని ఆయన చెప్పారు.

పని మనిషి సోమవారం ఉదయం మరణించగా, ఆ విషయాన్ని చాలా ఆలస్యంగా రాత్రి 8 గంటలకు బయటకు చెప్పారు. తనకు విషయం తెలిసిన వెంటనే ఢిల్లీకి వచ్చి పోలీసులకు సమాచారం అందించినట్లు ఎంపి చెప్పారు. అమ్మాయి పది నెలలుగా తన భార్య వద్ద పనిచేస్తోందని ఆయన చెప్పారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+