అక్రమ సంబంధం, ఇంట్లో ఏం చేస్తున్నాడంటే ?, అత్తకు ఫోన్ చేసి మ్యాటర్ చెప్పిన అల్లుడు !
వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులను చూసి అందరూ సంతోషించారు. మా అమ్మాయికి మంచి భర్త చిక్కాడని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పరాయి స్త్రీ వ్యామోహంలో పడిన భర్త అతని భార్యను టార్చర్ పెట్టాడు. ఇదే సమయంలో భార్య అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించింది.
కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని చన్నరాయపట్నణ తాలూకా నాగయ్యనకొప్పలు గ్రామంలో నవవధువు అనుమానాస్పద మృతి చెందింది. సురభి (24) అనే యువతి అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిందని పోలీసులు తెలిపారు. సురభి భర్త ఆమెను చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. సురభి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

హాసన్ జిల్లాలోని
హున్సూరుకు చెందిన సురభికి, నాగయ్యనకొప్పలు గ్రామానికి చెందిన దర్శన్‌తో వివాహమైంది. వివాహం సమయంలో సురభి కుటుంబ సభ్యులు దర్శన్ కు బైక్, కారు, కట్నం కింద డబ్బుతో పాటు బారీ మొత్తంలో బంగారు నగలు ఇచ్చారని సురభి కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే సోమవారం రాత్రి భర్త ఇంట్లో సురభి శవమై కనిపించింది.
సురభి ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త దర్శన్ అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. అయితే సురభి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన దర్శన్ మీ కూతురికి లో బీపీ వచ్చి చనిపోయిందని చెప్పడం అనేక అనుమానాలకు దారితీసింది. సురభి చనిపోయిందని ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించిన దర్శన్ తరువాత అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు.
సురభి తల్లిదండ్రులు పోలీసు కేసు పెట్టారు. మా అల్లుడు దర్శన్ తమ కుమార్తె సురభిని హత్య చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శన్ మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ప్రియురాలి మోజులోపడి మా కుమార్తెను నిత్యం టార్చర్ పెడుతున్నాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సురభి అనుమానాస్పద స్థితిలో చనిపోయిందని కేసు నమోదు చేశామని శ్రావణబెళగోల పోలీసులు అంటున్నారు.

సురభి శవాన్ని శ్రావణబెళగోల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, దర్శన్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని హాసన్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. అక్రమ సంబంధం ఏమిటని ప్రశ్నించిన సురభిని ఆమె భర్త దర్శన్ ఇంట్లోనే గొంతు నులిమి హత్య చేసి తరువాత ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications