Wife: లవ్ మ్యారేజ్, భార్య మీద ఫుల్ డౌట్, భార్యను ఫ్రెండ్స్ తో కిడ్నాప్ చేసి కారులో ?, గంటల్లో గ్రహాలు రివర్స్
పూణే/ముంబాయి: మంచి ఉద్యోగం చేస్తున్న యువతితో ఓ యువకుడికి పరిచయం అయ్యింది. కొంతకాలం తరువాత ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. యువకుడి కంటే వయసులో యువతి మూడు సంవత్సరాలు పెద్దది. ప్రేమికులు పెళ్లి కాకుండానే కొంతకాలం అద్దె ఇంటిలో కలిసి సహజీవనం చేశారు. ఇద్దరి మనసులు ఒక్కటి కావడంతో గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత మరో ఇంటిలో దంపతులు కాపురం పెట్టారు. భార్య ప్రతిరోజు ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది. బయట ఎక్కువగా తిరుగుతున్న భార్య మీద ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్తకు అనుమానం పెరిగింది. ఇదే విషయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.
భర్త తీరుతో విసిగిపోయిన భార్య అదే సిటీలో ఉంటున్న పుట్టింటికి వెళ్లిపోయి అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. నా భార్య నన్ను మోసం చేసి వేరేవాడితో కులుకుతోందని, నాకంటే డబ్బులు ఎక్కువగా ఉన్నవాడిని ఆమె తగులుకుందని రగిలిపోయిన భర్త అతని స్నేహితులతో కలిసి అతని భార్యను కిడ్నాప్ చేశాడు. భార్యను కిడ్నాప్ చేసి ఆమెను చంపేయాలని వెలుతున్న భర్తకు కొన్ని గంటల్లోనే గ్రహాలు అన్నీ ఒక్కసారిగా రివర్స్ కావడంతో అతనికి ఇప్పుడు సినిమా కనపడుతోంది.

ఉద్యోగం చేస్తున్న యువతి
మహారాష్ట్రలోని పూణే సిటీలో అమోల్ దేవ్ రావ్ ఖోస్ అలియాస్ అమోల్ (24) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పూణేలోనే నివాసం ఉంటున్న 27 ఏళ్ల వయసు ఉన్న శిరీషా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. రెండు సంవత్సరాల క్రితం అమోల్, శిరీషాకు పరిచయం అయ్యింది.

ప్రియురాలు వయసులో పెద్దది..... సహజీవనం
కొంతకాలం తరువాత అమోల్, శిరీషాల పరిచయం ప్రేమగా మారింది. అమోల్ కంటే వయసులో అతని ప్రియురాలు శిరీషా మూడు సంవత్సరాలు పెద్దది. ప్రేమికులు అమోల్, శిరీషా పెళ్లి కాకుండానే కొంతకాలం పార్చూరులో అద్దె ఇంటిలో కలిసి సహజీవనం చేశారు. అమోల్, శిరీషా చాలాకాలం పాటు పిచ్చపాటిగా ఎంజాయ్ చేసి ఒకరికి ఒకరు దగ్గర అయ్యారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మీద అనుమానం
అమోల్, శిరీషాల మనసులు ఒక్కటి కావడంతో గత ఏడాది పెళ్లి చేసుకున్నారు. వివాహం చేసుకున్న తరువాత మరో ఇంటిలో అమోల్, శిరీషా దంపతులు కాపురం పెట్టారు. భార్య శిరీషా ప్రతిరోజు ఉద్యోగం చెయ్యడానికి వెళ్లి వస్తోంది. బయట ఎక్కువగా తిరుగుతున్న భార్య శిరీషా మీద ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త అమోల్ కు అనుమానం పెరిగింది.

భార్యకు అక్రమ సంబంధం ఉందని తెలిసి ?
ఇదే విషయంలో అమోల్, శిరీషా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త అమోల్ తీరుతో విసిగిపోయిన భార్య శిరీషా అదే సిటీలో ఉంటున్న పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న శిరీషా అక్కడి నుంచి ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. నా భార్య శిరీషా నన్ను మోసం చేసి వేరేవాడితో కులుకుతోందని, నాకంటే డబ్బులు ఎక్కువగా ఉన్నవాడిని ఆమె తగులుకుందని అమోల్ రగిలిపోయాడు.

భార్యను చంపేయాలని కిడ్నాప్
శిరీషా మీద రగిలిపోయిన ఆమె భర్త అమోల్ అతని స్నేహితులు మహదేవ్ ఖానాపూరే (22), జ్ఞానేశ్వర్ బాబన్ పంజ్లే (23) తదితరులతో కలిసి ఇంటి నుంచి ఉద్యోగం చెయ్యడానికి వెలుతున్న భార్యను కారులో కిడ్నాప్ చేశాడు. భర్త అమోల్ అతని స్నేహితులు కిడ్నాప్ చెయ్యడంతో హడలిపోయిన శిరీషా ఆ ప్రాంతంలో ఆమె మొబైల్ ఫోన్ విసిరేసింది. మహిళను బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోతున్న సమయంలో ఆమె మొబైల్ విసిరేసిన విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

గంటల్లో చిక్కిపోయిన భర్త అండ్ కో
పోలీసులు శిరీషా మొబైల్ నెంబర్ కాల్ డేటా ఆధారంగా, కిడ్నాప్ జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోని ఉన్న మొబైల్ నెంబర్స్ ఆధారంగా దర్యాప్తు చేశారు. ఇదే సమయంలో కిడ్నాప్ చేసిన భార్య శిరీషాను చంపేయాలని పూణే సిటి దాటి వెలుతున్న అమోల్ కారును పోలీసులు అడ్డుకుని పరిశీలించారు. ఆ సమయంలో తనను వీళ్లు కిడ్నాప్ చేశారని శిరీషా పోలీసులకు చెప్పింది.
Recommended Video


ఏదో అనుకుంటే ఏదో జరిగిపోయింది
భార్య శిరీషాను కిడ్నాప్ చేసిన అమోల్, అతని స్నేహితులు మహదేవ్ ఖానాపూరే, జ్ఞానేశ్వర్ బాబన్ పంజ్లేని అరెస్టు చేశామని కేసు విచారణ చేస్తున్న సీనియర్ పోలీసు అధికారి సునీల్ జాదవ్ మీడియాకు చెప్పారు. భార్యను కిడ్నాప్ చేసి ఆమెను చంపేయాలని వెలుతున్న భర్త అమోల్ కు అన్ని గ్రహాలు ఒక్కసారిగా రివర్స్ కావడంతో అతనికి ఇప్పుడు త్రీడి సినిమా కనపడుతోంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications