Wife: క్రికెట్ బ్యాట్ తో భర్తను చితకబాదిన భార్య, సీసీటీవీ క్లిప్పింగ్స్, భర్త రివర్స్ కేసు, బావతో భార్యకు లింక
జైపూర్/రాజస్థాన్: వివాహం చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. భర్త టీచర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నాడు. అయితే భర్త అతని భార్య మీద గృహహింస కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. నేను ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని, ఎలాంటి కారణం లేకుండా నా భార్య నన్ను చితకబాదుతోందని భర్త కోర్టును ఆశ్రయించాడు. నా భార్య కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నానని, నన్ను మీరే రక్షించాలని భర్త కోర్టును, పోలీసులను ఆశ్రయించాడు. టీచర్ ను అతని భార్య కిక్రెట్ బ్యాట్ తో చితకబాదుతున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ పుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య తనను ఎలా చితకబాదుతుందో మీరే చూడాలని బాధితుడు ఆ వీడియోను కోర్టుకు. పోలీసులకు ఇచ్చాడు. తన మీద దాడి చెయ్యాలని తన భార్యను ఆమె బావ రెచ్చగొడుతున్నాడని, ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని భర్త ఆరోపిస్తున్నాడు. భర్తకు భద్రత కల్పించాలని, కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. భార్య మీద ఆమె భర్త రివర్స్ లో గృహహింస కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

10 ఏళ్ల క్రితం టీచర్ పెళ్లి
రాజస్థాన్ లోని అల్వార్ లోని బివాడిలో అజిత్ సింగ్ అలియాస్ అజిత్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 10 ఏళ్ల క్రితం అజిత్ సింగ్ సుమన్ అలియాస్ సుమనా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహం చేసుకున్న అజిత్ సింగ్, సుమనా దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా జీవించారు.

మొదట్లో టీచర్ కాపురం హ్యాపీ
అజిత్ సింగ్, సుమనా దంపతులకు 8 ఏళ్ల వయసు ఉన్న ఓ కొడుకు ఉన్నాడు. భర్త టీచర్ గా ఉద్యోగం చేస్తూ మంచి జీతం తీసుకుంటున్నాడు. సుమనాను వివాహం చేసుకున్న తరువాత టీచర్ అజిత్ సింగ్ చాలా సంతోషంగా జీవించాడని ఆయన బంధువులు, స్నేహితులు అంటున్నారు. తరువాత అజిత్ సింగ్, సుమనా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భార్య చితకొట్టుడు..... కోర్టును ఆశ్రయించిన టీచర్
ఇటీవల టీచర్ అజిత్ సింగ్ కోర్టును ఆశ్రయించాడు. నేను ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉందని, ఎలాంటి కారణం లేకుండా నా భార్య సుమనా నన్ను చితకబాదుతోందని ఆమె భర్త అజిత్ సింగ్ స్థానిక కోర్టును ఆశ్రయించాడు. నా భార్య సుమనా కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నానని, నన్ను మీరే రక్షించాలని టీచర్ అజిత్ సింగ్ కోర్టును, పోలీసులను ఆశ్రయించాడు.

కోర్టుకు సీసీటీవీ పుటేజీ ఇచ్చిన భర్త
టీచర్ అజిత్ సింగ్ ను అతని భార్య సుమనా చితకబాదుతున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ పుటేజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన భార్య సుమనా తనను ఎలా చితకబాదుతుందో మీరే చూడాలని, నేను ఆమెతో కలిసి ఉంటే కచ్చితంగా నన్ను చంపేస్తుందని బాధితుడు అజిత్ సింగ్ లబోదిబో అంటూ ఆ వీడియోను కోర్టుకు. పోలీసులకు ఇచ్చాడు.

నా భార్య, ఆమె బావకు అక్రమ సంబంధం... ఇద్దరూ ఒక్కటైపోయారు
అజిత్ సింగ్ కు భద్రత కల్పించాలని, కేసు విచారణ చేసి జూన్ 7వ తేదీన నివేదిక సమర్పించాలని కోర్టు స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. భార్య సుమనా మీద ఆమె భర్త అజిత్ సింగ్ రివర్స్ లో గృహహింస కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది. తన మీద దాడి చెయ్యాలని తన భార్య సుమనాను ఆమె బావ రెచ్చగొడుతున్నాడని, ఇద్దరికి అక్రమ సంబంధం ఉందని టీచర్ అజిత్ సింగ్ ఆరోపిస్తున్నాడని, ఇంతకాలం తన కొడుకు ముఖం చూసి తన భార్య ఆగడాలు భరించానని చెబుతున్నాడని జిల్లా ఎస్పీ విపిన్ శర్మా స్థానిక మీడియాకు చెప్పారు. మొత్తం మీద రాజస్థాన్ లో టీచర్ అజిత్ సింగ్ అతని భార్య సుమనా మీద గృహహింస చట్టం కింద కేసు పెట్టడం హాట్ టాపిక్ అయ్యింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications