డిన్నర్‌కు భార్య లేట్ చేసిందని ప్రొఫెసర్ ఆత్మహత్య

Wife joins late for dinner, professor ends life
బెంగళూర్: భార్య తనతో పాటు డిన్నర్ చేయడానికి పది నిమిషాలు ఆలస్యం చేసిందనే కోపంతో ఓ ప్రొఫెసర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన బెంగళూర్‌లోని ఇందిరానగర్‌లో గల లాల్ బహదూర్ శాస్త్రి నగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. మూడ్ స్వింగ్స్‌తో ఆ ప్రొఫెసర్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది.

ఆర్‌కె పురం ఈస్ట్ వెస్ట్ కాలేజీలో పనిచేస్తున్న సునీల్ దొడ్డన్నయ్య తన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి భోజనానికి భార్యను పిలిచాడు. ఆమె పది నిమిషాలు జాప్యం చేసింది. దాంతో కోపం వచ్చిన సునీల్ పడకగదిలోకి వెళ్లి లోపల గడియ వేసుకున్నాడు. ఈ విషయాన్ని తండ్రి దొడ్డన్నయ్య పోలీసులకు చెప్పాడు.

సునీల్ మూడ్ స్వింగ్స్‌తో బాధపడుతున్నాడని, కుటుంబ సభ్యులతో గొడవ పడినప్పుడు గదిలోకి వెళ్లి లోపల గడియవేసుకోవడం అతనికి అలవాటు అని దొడ్డన్నయ్య చెప్పారు. ఆ రోజు కూడా అదే విధంగా లోనికి వెళ్లి గడియ వేసుకున్నాడని ఆయన చెప్పారు.

శుక్రవారం ఉదయం తాము పిలిచినా, తలుపు కొట్టినా ఏ విధమైన ప్రతిస్పందన లేకపోవడంతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని, తలుపులను బలవంతంగా తెరిచి చూసే సరికి అతను ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని తండ్రి చెప్పారు. అయితే, సూసైడ్ నోట్ అది దొరకలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+