Newly married: బెడ్ రూమ్ లో భార్య పక్కనే శవమైన భర్త, పెళ్లైన 20 రోజులకే, భార్య చంపేసిందని?

భోపాల్/చెన్నై: ఇంట్లో పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న యువతి, యువకుడు 17 రోజులు సంతోషంగా కాపురం చేశారు. వివాహం జరిగిన తరువాత కూడా పెళ్లి కూతురు ఆమె పుట్టింటిలో ఉంది. కొత్త పెళ్లి కూతురి ఇంటికి వెళ్లి వస్తున్న పెళ్లి కొడుకు అందరితో సంతోషంగానే ఉన్నాడు. పెళ్లి కూతురు అత్తారింటిలో అడుగుపెట్టింది. కొత్త దంపతులు కొన్ని రోజులు సంతోషంగా ఉండాలని అనుకున్న పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఊరికి వెళ్లారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఒకే రూమ్ లో ఉన్నారు. మరుసటి రోజు ఉదయం భర్త శవమై కనిపించాడు. పెళ్లి కూతురు బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకును చంపేసిందని కేసు పెట్టడం కలకలం రేపింది.

 ఇంట్లో చూసిన పెళ్లిసంబంధం

ఇంట్లో చూసిన పెళ్లిసంబంధం

మధ్యప్రదేశ్ లోని విదిశానగర్ కు సుమారు 75 కిలోమీటర్ల దూరంలోని మాలియా ఖేడి గ్రాయంలో సోనూ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కుటుంబ సభ్యులు చూసిన 22 ఏళ్ల రేఖా (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో సోనూ వివాహం నిశ్చయం అయ్యింది. సోనూను పెళ్లి చేసుకోవడానికి రేఖా కూడా సంతోషంగా అంగీకరించిందని సమాచారం.

లాక్ డౌన్ లో సింపుల్ గా పెళ్లి

లాక్ డౌన్ లో సింపుల్ గా పెళ్లి

కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ అమలు చెయ్యడంతో ముందుగా అనుకున్న ముహూర్తానికి సోనూ, రేఖ పెళ్లి చెయ్యాలని పెద్దలు నిర్ణయించారు. జూన్ 20వ తేదీన సోనూ, రేఖ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన రోజు నుంచి నవ దంపతులు రేఖ, సోనూ రెండు వైపులా ఉన్న బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు.

అత్తారింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురు

అత్తారింటిలో అడుగుపెట్టిన కొత్త పెళ్లికూతురు

వివాహం జరిగిన తరువాత రేఖా కొన్ని రోజులు ఆమె పుట్టింటిలోనే ఉంది. పెళ్లి కొడుకు సోనూ అత్తారింటికి వెళ్లి భార్య రేఖాతో ఎంజాయ్ చేసి వస్తున్నాడు. వివాహం జరిగిన తరువాత పుట్టింటిలోనే ఉంటున్న రేఖా అత్తారింటికి వెళ్లడానికి సిద్దం అయ్యింది. పుట్టింటి వాళ్లు రేఖాను అత్తారింటిలో వదిలిపెట్టారు.

ఒకే రూమ్ లో దంపతులు..... శవమైన భర్త

ఒకే రూమ్ లో దంపతులు..... శవమైన భర్త

కొత్త పెళ్లి కూతురు రేఖా ఇంటికి రావడంతో అందరూ సంతోషించారు. నవదంపతులు సరసాలు ఆడుకోవడానికి మేము అడ్డు ఎందుకు అని బావించిన సోనూ కుటుంబ సభ్యులు అందరూ వాళ్ల బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. ఆరోజు రాత్రి సోనూ, రేఖా మాత్రమే ఇంట్లో ఉన్నారు. మరుసటి రోజు ఉదయం సోనూ శవమైకనిపించాడని రేఖా గట్టిగా కేకలు వేయడం కలకలం రేపింది.

పెళ్లి కూతురి మీద అనుమానం

పెళ్లి కూతురి మీద అనుమానం

భార్య, భర్త ఒకే రూమ్ లో ఉన్న సమయంలో, ఇంట్లో ఎవ్వరు లేని టైమ్ లో సోనూ శవమై కనిపించడం అనేక అనుమానాలకు దారితీసింది. ఇంటి తలుపులు ఎలా వేశారో అలాగే ఉండటంతో దుండుగులు సోనూను హత్య చెయ్యడానికి అవకాశం లేదని, అతనికి శత్రువుల కూడా ఎవరూ లేరని పోలీసులు అంటున్నారు. తమ కుమారుడు సోనూను ఆమె భార్య రేఖాను హత్య చేసి ఉంటుందని వరుడి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. రేఖాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పెళ్లి అయిన 20 రోజులు కాకుండానే పెళ్లి కొడుకు సోనూ హత్యకు గురి కావడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+