Wife: యూనివర్శిటీ క్యాంపస్ లో ప్రొఫెసర్ భార్య దారుణ హత్య, క్వాటర్స్ వెనుకనే వైస్ చాన్సలర్ క్వాటర్స్ !
పంజాబ్: ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఆయన భార్య, కుమార్తెతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రొఫెసర్ కుటుంబ సభ్యులు యూనివర్శిటీ క్యాంపస్ లోని క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు. దీపావళి పండుగ సందర్బంగా ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్లాలని ఆ ప్రొఫెసర్ రాత్రి అనుకున్నాడు. ఉదయం నిద్రలేచిన ప్రొఫెసర్ మేడ మీద నుంచి కిందకు వచ్చాడు. అంతే కింద హాల్ లో భార్య శవమై కనిపించడంతో ప్రొఫెసర్ షాక్ అయ్యారు. పండుగ రోజు ఎవరు ఇంట్లోకి వచ్చి తన భార్యను హత్య చేశారో అర్థం కాక గట్టిగా కేకలు వేశారు. ప్రొఫెసర్ క్వాటర్స్ వెనుకనే యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ నివాసం కూడా ఉండటం, అంత ధైర్యంగా వచ్చి హత్య చెయ్యడంతో యూనివర్శిటీ క్యాంపస్ లో నివాసం ఉంటున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ప్రొఫెసర్ కాపురం
పంజాబ్ యూనివర్శిటీలో బిబి గోయెల్ యూనివర్శిటీ ఆఫ్ బిజినెస్ స్కూల్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న బిబి గోయెల్ ఆయన భార్య సీమా గోయెల్ (59), కుమార్తెతో కలిసి సంతోషంగా జీవిస్తున్నాడు. ప్రొఫెసర్ బిబి గోయెల్ కుటుంబ సభ్యులు ఛండీగఢ్ లోని పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ లోని క్వాటర్స్ లో నివాసం ఉంటున్నారు.

దీపావళి పండుగ హ్యాపీగా చేసుకోవాలని ?
బుధవారం రాత్రి ప్రొఫెసర్ బిబి గోయెల్ ఆయన భార్య సీమా గోయెల్ తో కలిసి భోజనం చేశాడు. ప్రొఫెసర్ కుమార్తె ఇంట్లో లేదు. దీపావళి పండుగ సందర్బంగా ఇంట్లో పూజ చేసి గుడికి వెళ్లాలని ఆ ప్రొఫెసర్ బిబి గోయెల్ బుధవారం రాత్రి అనుకున్నాడు. బుధవారం రాత్రి ప్రొఫెసర్ బిబి గోయెల్ మేడ మీదకు వెళ్లి నిద్రపోయాడు. కింద హాల్ లో సీమా గోయెల్ నిద్రపోయారు.

నిద్రలేచి చూస్తే శవమైన భార్య
ఉదయం నిద్రలేచిన ప్రొఫెసర్ బిబి గోయెల్ మేడ మీద నుంచి కిందకు వచ్చాడు. అంతే కింద హాల్ లో భార్య సీమా గోయెల్ శవమై కనిపించడంతో ప్రొఫెసర్ బిబి గోయెల్ షాక్ అయ్యారు. పండుగ రోజు ఎవరు ఇంట్లోకి వచ్చి తన భార్య సీమాను హత్య చేశారో అర్థం కాక ప్రొఫెసర్ బిబి గోయెల్ గట్టిగా కేకలు వేశారు.
Recommended Video

పరుగు తీసిన సెక్యూరిటీ గార్డులు
ప్రొఫెసర్ బిబి గోయెల్ గట్టిగా కేకలు వేసి ఆర్తనాదాలు చెయ్యడంతో పంజాబ్ యూనివర్శిటీ క్యాంపస్ లో నివాసం ఉంటున్న ఉద్యోగులు హడలిపోయి ఆయన ఇంటి దగ్గరకు పరుగు తీశారు. సీమాను హత్య చేసిన వారు క్యాంపస్ లోపల చిక్కకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ప్రొఫెసర్ బిబి గోయెల్ నివాసం ఉంటున్న క్వాటర్స్ వెనుకనే పంజాబ్ యూనివర్శిటీ వైస్ చాన్స్ లర్ నివాసం కూడా ఉంది. అంత ధైర్యంగా వచ్చి ప్రొఫెసర్ భార్య సీమా గోయెల్ ను హత్య చెయ్యడంతో యూనివర్శిటీ క్యాంపస్ లో నివాసం ఉంటున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హడలిపోయారు.












Click it and Unblock the Notifications