Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Arshdeep Singh: సమన్లు జారీ చేసిన కేంద్రం..!!

దుబాయ్: ఆసియా కప్ 2022 సూపర్ 4లో భారత క్రికెట్ జట్టు పరాజయాన్ని చవి చూసిన ప్రభావం.. ప్రకంపనలు రేపుతోంది. ఏకంగా సమన్లను జారీ చేసే పరిస్థితికి చేరింది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో అయిదు వికెట్ల తేడాతో పరాజయం పాలైన అనంతరం బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ విమర్శలకు కేంద్రబిందువు అయ్యారు. నెటిజన్లు ఆయనపై ఖలిస్తానీ అనే ముద్రను వేశారు.

భారీ స్కోర్ సాధించినా..

టాస్ ఓడిపోయి- తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లల్లో 181 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. శుభారంభం చేశారు. తొలి వికెట్ భాగస్వామ్యానికి 54 పరుగులు జోడించారు. ఓవర్‌కు తొమ్మిదికి పైగా రన్‌రేట్‌తో స్కోర్ బోర్డ్‌ను పరుగులు పెట్టించారు. ఒక దశలో 200కు పైగా పరుగులు సాధిస్తారని భావించినప్పటికీ.. మిడిల్ ఓవర్లల్లో పాకిస్తాన్ బౌలర్లు రిథమ్ అందుకున్నారు. వరుసగా వికెట్లు పడగొట్టారు. ఆ తరవాత పాకిస్తాన్ అయిదు వికెట్లను నష్టపోయి 19.5 ఓవర్లల్లో లక్ష్యాన్ని అందుకుంది.

అర్ష్‌దీప్ సింగ్‌పై..

ఆసిఫ్ అలీ క్యాచ్ డ్రాప్..టీమిండియా ఓటమికి ప్రధాన కారణమైంది. పాకిస్తాన్ చివరి 15 బంతుల్లో 31 పరుగులు చేయాల్సిన దశలో క్యాచ్ డ్రాప్ చేశాడు అర్ష్‌దీప్ సింగ్. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో అవుట్ ‌సైడ్ హాఫ్‌గా వెలువడిన బంతిని స్లాంగ్ స్వీప్ షాట్ ఆడబోయాడు ఆసిఫ్ అలీ. టైమింగ్ మిస్ అయ్యాడు. బంతి ఎడ్జ్ తీసుకుని షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా గాల్లోకి ఎగిరింది. లడ్డూ లాంటి క్యాచ్ అది. చెమట పట్టకుండా పట్టగలిగే క్యాచ్. అక్కడే ఉన్న అర్ష్‌దీప్ సింగ్ దాన్ని అందుకోలేకపోయాడు.

ఖలిస్తానీగా..

ఖలిస్తానీగా..

క్యాచ్ డ్రాప్ తరువాత ఆసిఫ్ అలీ చెలరేగాడు. 8 బంతుల్లో రెండు సిక్సర్లు ఒక ఫోర్ బాదాడు. రిక్వైర్డ్ రన్‌రేట్ బాగా తగ్గింది. చివరి ఓవర్ నాలుగో బంతికి అతను అవుట్ అయినప్పటికీ.. అప్పటికే పాకిస్తాన్ విజయానికి చేరువైంది. ఈ క్యాచ్ డ్రాప్.. అర్ష్‌దీప్ సింగ్‌ను విమర్శలకు గురి చేసింది. అతణ్ని ఖలిస్తానీగా అభివర్ణిస్తోన్నారు నెటిజన్లు. #khalistani అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. వేలల్లో ట్వీట్లు పడుతున్నాయి. అతనికి మద్దతుగానూ పోస్టింగ్స్ పెడుతున్నారు మరికొందరు నెటిజన్లు. #IstandWithArshdeep అంటూ పోస్టింగులు చేస్తోన్నారు.

 వికీపీడియాకు కేంద్రం సమన్లు..

వికీపీడియాకు కేంద్రం సమన్లు..

దీని తరువాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అర్ష్‌దీప్ సింగ్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వికీపీడియా భారత ప్రతినిధులకు సమన్లను జారీ చేసింది. అర్ష్‌దీప్ సింగ్‌ వికీపీడియా పేజీలో ఖలిస్తానీ పేరు కనిపించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఉద్దేశపూరకంగా ఈ పేజీలో మార్పులు- చేర్పులు చేసి ఉంటారని భావిస్తోంది. దీనిపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు సమన్లు ఇచ్చారు.

పాకిస్తాన్ నుంచి..

పాకిస్తాన్ నుంచి..

అర్ష్‌దీప్ సింగ్ వికీపీడియా పేజీని పాకిస్తాన్ నుంచి ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఐపీ అడ్రస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్తాన్ నుంచి ఈ పేజీని ఎడిట్ చేసి అందులో ఖలిస్తాన్ అనే పదాలను పొందుపరిచినట్లు చెబుతున్నారు. మ్యాచ్ ముగిసిన తరువాతే- వికీపీడియా పేజీని ఎడిట్ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని, అందుకే వివరణ కోసం వికీపీడియా ప్రతినిధులకు సమన్లు జారీ చేసిందని చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+