కూలగొడుతాం: చైనాకు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక

కన్హచట్టి (జార్ఖండ్): తాము పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని, అయితే మన దేశ పరిధిలో చైనా రోడ్లు నిర్మిస్తే కూలగొడుతామని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. భారతదేశ భూభాగంలో చైనా రోడ్లు కడితే ఏం చేస్తారని అడిగితే మన బలగాలకు వాటిని కూల్చడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని జవాబిచ్చారు.

భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చే చర్యలకు, రోడ్ల నిర్మాణానికి చైనా స్వస్తి చెప్పాలని ఆయన సూచిచారు. చైనాతో తాము మంచి సంబంధాలనే కోరుకుంటున్నామని, చైనా మన మనోభావాలను గౌరవించాలని ఆయన అన్నారు. భారత భూభాగంలో చైనా రోడ్లను నిర్మిస్తే తమకు వాటిని కూల్చడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేస్తూ చైనాకు బలమైన హెచ్చరికలను పంపించారు.

Will 'break' any Chinese construction on Indian territory, Rajnath warns

తరుచుగా చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడడానికి చేస్తున్న ప్రయత్నం వల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. భారతదేశంలోకి చైనా బలగాలు చొచ్చుకు వస్తున్న విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల భారత పర్యటనకు వచ్చినప్పుడు చైనా అధ్యక్షుడు జడిన్‌పింగ్ దృష్టికి కూడా తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+