వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఓకే చెప్పిన రాహుల్ గాంధీ: ముగ్గురు సీఎంలతోపాటు సీనియర్ నేతలు ఇలా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు మాజీ డిఫెన్స్ మినిస్టర్ ఏకే అంటోని సహా పలువురు సీనియర్ నేతలు కూడా రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగాలని కోరారు. దీంతో రాహుల్ గాంధీ కూడా అందుకు సానుకూలంగా స్పందించారు.

శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపేందుకు సీడబ్ల్యూసీ నిర్ణయించింది. కాంగ్రెస్ నేతలంతా కూడా రాహుల్ గాంధీ మరోసారి కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారని సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ తెలిపారు.

 Will Consider Becoming Congress Chief Again, Rahul Gandhi says At CWC Meet.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాలని నేతలంతా డిమాండ్ చేస్తున్నారని మరో నేత అంబికా సోని తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీ కొనసాగాలని తామంతా కోరుకుంటున్నామని మాజీ కేంద్రమంత్రి, లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను తీసుకోవాలని తామంతా రాహుల్ గాంధీని కోరామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణజిత్ సింగ్ చన్నీచెప్పారు.

ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలు కోరిన నేపథ్యంలో తాను పరిశీలిస్తానంటూ రాహుల్ గాంధీ సమాధానమిచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆ బాధ్యతలను ఆయన తల్లి సోనియా గాంధీ చేపట్టారు. ఆ తర్వాత ఇప్పుడు నేతలంతా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు రాహుల్ గాంధీ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

కాగా, ఈ సమయంలో ప్రస్తుతం తాను తాత్కాలిక అధ్యక్షురాలిని కాదని, పూర్తిస్థాయి అధ్యక్షురాలినని సోనియా గాంధీ స్పష్టం చేశారు. జీ-23 అసమ్మతి నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి తాత్కాలిక అధ్యక్షురాలిని కాదు.. పూర్తి స్థాయి అధ్యక్షురాలిని నేనేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ. పార్టీ అంతర్గత సమస్యలపై బహిరంగంగా విమర్శిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. గీత దాటితే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. ఏం అంశంపైనైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో కలిసి పనిచేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు సోనియా గాంధీ.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమై సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ 'జి 23' గ్రూపు నాయకులను లక్ష్యంగా చేసుకుని వార్నింగ్ ఇచ్చారు. తాను పార్టీకి శాశ్వత అధ్యక్షురాలిని.. వారితో మాట్లాడటానికి మీడియాను ఆశ్రయించాల్సిన అవసరం లేదని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ సోనియా గాంధీ ఇలా అన్నారు. "మేము అనేక సవాళ్లను ఎదుర్కొంటాము. కానీ మనం ఐక్యంగా, క్రమశిక్షణతో ఉండి.. పార్టీ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి పెడితే.. మేము తప్పకుండా రాణిస్తాం." ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మణిపూర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రారంభమయ్యాయి.

'కాంగ్రెస్ మళ్లీ బలంగా ఉండాలని మొత్తం పార్టీ కోరుకుంటోంది. కానీ దీని కోసం ఐక్యత ఉండాలి. పార్టీ ప్రయోజనాలను అత్యున్నతంగా ఉంచాలి. అన్నింటికీ మించి స్వీయ నియంత్రణ, క్రమశిక్షణ అవసరం. కరోనా సంక్షోభం కారణంగా అధ్యక్షుడి ఎన్నికకు గడువు పొడిగించాల్సి వచ్చిందని సోనియా గాంధీ అన్నారు.

సీడబ్ల్యూఎస్ సమావేశంలో కీలక నిర్ణయాలు

2021 నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు దేశవ్యాప్తంగా సాగనున్న కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం
2022 ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య ఖరారు కానున్న డీసీసీ ఎన్నికలకు పోటీ పడే అభ్యర్థుల జాబితా
2022 ఏప్రిల్ 16 నుంచి మే 31 వరకు ప్రాధమిక కమిటీలు, బూత్ కమిటీలు ,బ్లాక్ కమిటీల అధ్యక్షుల ఎంపిక
2022 జులై 21 నుంచి 20 ఆగస్ట్ వరకు పీసీసీ, ఉపాధ్యక్షులు, కోశాధికారి, పిసిసి కార్యదర్శి వర్గం, ఏఐసిసి సభ్యులు ఎన్నిక
2022 ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు సాగనున్న ఏఐసిసి అధ్యక్ష ఎన్నిక
2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్లీనరీ సమావేశం సందర్భంగా సిడబ్ల్యుసి సభ్యులు, ఏఐసిసి కమిటీల అధ్యక్షుల ఎంపిక.

English summary
"Will Consider" Becoming Congress Chief Again, Rahul Gandhi says At CWC Meet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X