డీఎంకే మద్దతు కోరుతున్న మన్నార్ గుడి: స్టాలిన్ సహాయంతో పళని, పన్నీర్ ప్రభుత్వానికి చెక్ !
తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎంతకైనా తెగించాలని టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు ముమ్మరం టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు డీఎంకే మద్దతు తీ
చెన్నై: తమిళనాడులో ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎంతకైనా తెగించాలని టీటీవీ దినకరన్, మన్నార్ గుడి మాఫియా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు డీఎంకే మద్దతు తీసుకోవడానికి సిద్దం అయ్యారని వెలుగు చూసింది.
తమిళనాడులో రాజకీయంగా ఏఐఏడీఎంకే, డీఎంకే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులు, కార్యకర్తలు సైతం ఎప్పుడూ ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరుకుంటుంటారు. అలాంటిది అన్నాడీఎంకే పార్టీలోని కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి డీఎంకే కలవడానికి సిద్దం అయ్యారు.

శశికళ సోదరుడు దివాకరన్ ఓ మీడియా చానల్ కు ఇంటర్వూ ఇస్తూ ఎలాగైనా సరే ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, నమ్మక ద్రోహం చేసిన వ్యక్తికి తగిన బుద్ది చెబుతామని, అవసరం అయితే స్టాలిన్ మద్దతు తీసుకుంటామని బహిరంగంగానే హెచ్చరించారు. ఇక తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకేతో దోస్తి చెయ్యడానికి టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు.
శాసనసభలో ఎడప్పాడి ప్రభుత్వానికి బలపరీక్ష (ఫ్లోర్ టెస్ట్) నిర్వహించేలా చేసి ప్రభుత్వానికి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేదని నిరూపించాలని, అందుకు అవసరం అయితే డీఎంకే మద్దతు తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. మొత్తం మీద ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గాలు ఒక్కటి కావడంతో టీటీవీ దినకరన్ వారికి పక్కలో బల్లెం అవుతున్నారు.












Click it and Unblock the Notifications