రాజస్థాన్‌లో మోడీ వర్సెస్ గెహ్లాట్: అసెంబ్లీ ఫలితాలే లోక్‌సభ ఎన్నకల్లో రిపీట్ అవుతాయా..?

రాజస్థాన్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలా అయితే గెలవగలిగిందో... సోమవారం జరగనున్న ఐదవ విడత పోలింగ్‌లో 12 లోక్‌సభ స్థానాల్లో కూడా విజయం సాధిస్తామన్న ఆశ ఆ పార్టీలో బలంగా కనిపిస్తోంది. ఈ 12 లోక్‌సభ స్థానాల్లో ఉన్న సగానికిపైగా అసెంబ్లీ నియోజకవర్గాలు అంటే 61 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక నాగౌర్ , సికర్, భరత్‌పూర్, అల్వార్, దౌసా, ధోల్‌పూర్, చురూ నియోజకవర్గాల్లో అత్యధిక అసెంబ్లీ సెగ్మెంట్లను 2018లో కాంగ్రెస్ గెలుచుకుంది. సోమవారం జరుగుతున్న పోలింగ్‌లో ఈ ఏడు లోక్‌సభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి,

వసుంధరా రాజే ఓటమితో వ్యతిరేకత ముగిసింది

వసుంధరా రాజే ఓటమితో వ్యతిరేకత ముగిసింది

2019 ఎన్నికలు 2018 అసెంబ్లీ ఎన్నికలు వేరుగా చూడాలని అన్నారు సికర్ జిల్లా బీజేపీ చీఫ్ విష్ణు చేతనియా. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలు ప్రధానిని ఎన్నుకునే ఎన్నికలని.. నాడు బీజేపీపై ఉన్న వ్యతిరేకత వసుంధరా రాజే ఓటమితో అంతమైందని అన్నారు. ప్రస్తుతం పోటీ మోడీనా అశోక్ గెహ్లాట్‌ల మధ్య జరుగుతోందన్నారు. రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ్ పథకం పై మిశ్రమ స్పందన వస్తోందని విష్ణు చేతనియా చెప్పారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే పుల్వామా దాడులు తర్వాత పాకిస్తాన్‌పై జరిగిన దాడులు బీజేపీకి అనుకూలిస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఎందుకంటే రాజస్థాన్‌లోని నాగౌర్, ఝున్‌ఝును , సికర్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో జవాన్లు రిక్రూట్ అయ్యారని గుర్తు చేశారు.

 రాఫెల్, పెద్దనోట్ల రద్దుపై ఆసక్తి చూపని ప్రజలు

రాఫెల్, పెద్దనోట్ల రద్దుపై ఆసక్తి చూపని ప్రజలు

2019 ఎన్నికలు మోడీ గెహ్లాట్ పాపులారిటీల మధ్య జరుగుతున్న ఎన్నికలని ఓం ప్రకాష్ శర్మ అనే వ్యక్తి తెలిపారు. గెహ్లాట్ మంచి వ్యక్తిగా అభివర్ణించిన ఆయన 2018లో కాంగ్రెస్‌కు ఓటువేసినట్లు తెలిపారు.ఈసారి మాత్రం తన ఓటు బీజేపీకే అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధానిని ఎన్నుకోవాల్సి ఉంటుంది కాబట్టి తన ఓటు మోడీకే అని తేల్చి చెప్పారు. ఇక మోడీ పాపులారిటీ గురించి చెప్పాల్సిన పనిలేదని మరోవ్యక్తి తెలిపాడు. అదు సమయంలో మోడీ పాలనలో జరిగిన రాఫెల్ ఒప్పందం, పెద్దనోట్ల రద్దుపై ప్రజలు వినేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపాడు. ఇదిలా ఉంటే తనకు 25వేల రూపాయలను గెహ్లాట్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్పిన ఆటోడ్రైవర్ నిరంజన్ సింగ్.... కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏడాదికి రూ.72 వేలు ఇస్తామని చెబుతున్నారని అయితే అంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో అనేదానిపై మాత్రం కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడం లేదని అన్నాడు.

 జాట్లు ఎవరి వైపు... రాజ్‌పుత్‌లు ఎవరిని ఆదరిస్తారు..?

జాట్లు ఎవరి వైపు... రాజ్‌పుత్‌లు ఎవరిని ఆదరిస్తారు..?

ఇదిలా ఉంటే మతాల పేరుతో, కులాల పేరుతో రాజకీయాలు చేయొద్దని ఎంతో స్నేహంగా ఉన్న వారి మధ్య చిచ్చుపెట్టొదని మోడీకి, రాహుల్ గాంధీలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పాడు పండ్ల వ్యాపారి ఇష్కుర్ రెహ్మాన్. ఇదిలా ఉంటే సోమవారం రోజున జాట్-రాజ్‌పుట్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోలింగ్ జరుగుతోంది. జాట్లు ఎప్పటి నుంచో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుగా ఉన్నప్పటికీ 2014లో మాత్రం బీజేపీ వైపు మొగ్గుచూపడం జరిగింది. రాజ్‌పుత్‌లు తొలి నుంచి బీజేపీ మద్దతుదారులుగా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+