వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేయకుంటే కోర్టుకెళ్తాం: ఎన్నికల కమిషన్‌కు మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్

|
Google Oneindia TeluguNews

మణిపూర్ లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు హీట్ గా మారాయి. ఇక ఇదే సమయంలో ఎన్నికల విషయంలో పలు అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. తాజాగా మణిపూర్ క్రిస్టియన్ సంయుక్త ఆర్గనైజేషన్ (AMCO) ఎన్నికల తేదీలను రీషెడ్యూల్ చేయాలని కోరుతూ భారత ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది.

Recommended Video

Assembly Elections 2022 Schedule For 5 States | Election Commission | Oneindia Telugu

Goa elections: రాహుల్ గాంధీ ఒక టూరిస్ట్ పొలిటీషియన్; గోవాలో రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ఎదురుదాడిGoa elections: రాహుల్ గాంధీ ఒక టూరిస్ట్ పొలిటీషియన్; గోవాలో రాహుల్ కామెంట్స్ పై బీజేపీ ఎదురుదాడి

 ఫిబ్రవరి 27న జరగనున్న తొలి విడత పోలింగ్ రీ షెడ్యూల్ చెయ్యాలన్న మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్

ఫిబ్రవరి 27న జరగనున్న తొలి విడత పోలింగ్ రీ షెడ్యూల్ చెయ్యాలన్న మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్

ఫిబ్రవరి 27న జరగనున్న తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ను రీషెడ్యూల్ చేయాలని రాజకీయ పార్టీలు, పలు క్రిస్టియన్ సంస్థలు కోరాయి.ఆదివారం రోజు క్రైస్తవ సంఘం ప్రార్థనా దినమని పేర్కొన్నారు. క్రైస్తవ మతానికి చెందిన మత పెద్దల సమావేశం గురువారం జరిగింది. జనవరి 17న, ఆల్ మణిపూర్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ (AMCO) నాయకులు మణిపూర్ రాష్ట్ర ఎన్నికల అధికారి కలిశారు, తేదీని మార్చాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)ని అభ్యర్థించారు. ఆదివారం జరగనున్న మొదటి దశ పోలింగ్ తేదీని రీషెడ్యూల్ చేయాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి విజ్ఞప్తి చేయాలని సమావేశం తీర్మానించిందని మణిపూర్ క్రిస్టియన్స్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ప్రిం వైఫీ తెలిపారు.

 రీ షెడ్యూల్ చెయ్యకుంటే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం

రీ షెడ్యూల్ చెయ్యకుంటే కోర్టును ఆశ్రయించాలని నిర్ణయం

కేంద్ర ఎన్నికల కమిషన్ మణిపూర్ తొలిదశ ఎన్నికలను రీషెడ్యూల్ చేయకపోతే కోర్టును ఆశ్రయించాలని సమావేశం నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. క్రైస్తవ సంఘం ఈ విషయంలో వెనుకకు పోదని, క్రైస్తవుల హక్కులను సాధించటం కోసం పోరాడుతూనే ఉంటుంది" అని వైఫీ వెల్లడించారు.నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) ప్రెసిడెంట్ అవాంగ్‌బౌ న్యూమై మాట్లాడుతూ ఇది క్రైస్తవ సమాజానికి పవిత్రమైన రోజు అని వెల్లడించారు. ఇది వారికి విశ్రాంతి మరియు ఆరాధన దినం అని పేర్కొన్నారు.

ఆదివారం రోజు క్రైస్తవ సమాజ ప్రార్థనా దినం, ఆ రోజు పోలింగ్ వద్దు

ఆదివారం రోజు క్రైస్తవ సమాజ ప్రార్థనా దినం, ఆ రోజు పోలింగ్ వద్దు

భారతదేశం ప్రతి మతాన్ని సమానంగా చూసే లౌకిక దేశమని, ఒక మత హక్కును ఉల్లంఘించడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ క్రైస్తవుల హక్కులను కూడా సమానంగా పరిగణించాలని, ఆదివారం రోజు క్రైస్తవ సంఘం ప్రార్థనా దినమని కాబట్టి మొదటి దశ పోల్‌ను మళ్లీ షెడ్యూల్ చేయాలని పేర్కొన్నారు.మణిపూర్‌లోని మూడు మిలియన్ల జనాభాలో క్రైస్తవ జనాభా 41.29 శాతం. 41.39 శాతం మంది హిందువులు కాగా, 8.40 శాతం మంది ముస్లింలు ఉన్నారు.

English summary
The All Manipur Christian Organizations has told the Election Commission that it will go to court if the election dates are not rescheduled. First phase election day is said to be the day of prayer for the Christian community .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X