లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్ష కూటమిలో చేరేది లేదు: షాకిచ్చిన కేజ్రీవాల్

ఛండీఘర్: బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న ప్రతిపక్ష కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ చేరదని ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. రానున్న 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు ఏకమవ్వాలని భావిస్తున్న విషయం తెలిసిందే.

హర్యానాలోని రోహ్‌తక్‌లో కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. సదరు కూటమిలో పార్టీలకు దేశాభివృద్ధిలో ఎలాంటి కీలక పాత్ర ఉండదని అన్నారు. గురువారం జరిగిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలోనూ ఆప్.. కాంగ్రెస్‌కు మద్దతివ్వని విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ కాటూమిలోనూ చేరదబోదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.

Will Not Join Opposition Alliance For Lok Sabha Polls: Arvind Kejriwal

వచ్చే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పార్లమెంటు ఎన్నికల్లోనూ ఆప్ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం అడ్డు తగులుతోందని, కేంద్రం వల్లే చాలా పనులు పెండింగ్‌లో ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+