ఆరు నెలలపాటు మీడియాతో మాట్లాడను: పారికర్
పనాజి: ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్.. ఆరు నెలల పాటు ప్రసార మాధ్యమాల(మీడియా)తో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు.
శనివారం గోవాలో ఒక ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన నిమిత్తం వచ్చిన ఆయన, స్వయంగా మీడియాకు ఈ విషయం వెల్లడించారు. రక్షణ శాఖ సంబంధిత కొన్ని అంశాలపై ఆయన వ్యాఖ్యను తెలుసుకోవడానికి మీడియా ప్రయత్నించినప్పుడు పై విధంగా బదులిచ్చారు.

గత 40-50 ఏళ్లలో మన దేశం ఒక యుద్ధానికీ దిగకపోవడం వల్ల భారత సైన్యం ప్రాముఖ్యం తగ్గిపోయిందంటూ ఇటీవల చెప్పడం సహా రక్షణశాఖకు చెందిన ఏ ప్రశ్నకూ సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు.
తీవ్రవాదుల్ని తీవ్రవాదంతోనే ఎదుర్కోవాలి, చైనాలో తయారయ్యే గణేశ్ విగ్రహాల కళ్లు చిన్నవి... ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల్ని పారికర్ ఇటీవల చేసిన విషయం తెలిసిందే. తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలోనే కొంతకాలంపాటు మీడియాతో మాట్లాడకూడదని పారికర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications