ఎగ్జిట్ పోల్స్: బాధ్యత నాదేనని కిరణ్ బేడీ, కాంగ్రెస్ ధీమా

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపోటములకు బాధ్యత తనదేనని భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ శనివారం చెప్పారు. ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పాయి. దీనిపై కిరణ్ బేడీ పైవిధంగా స్పందించారు. ఎగ్జిట్ పోల్స్ మూడు గంటల వరకే తీసుకున్నారని చెప్పారు.

ఈ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు కోరుకున్నట్లే జరుగుతుందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెపవ్పారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఓటేసిన అనంతరం ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా వెనుదిరిగారు.

సోనియా తనయ ప్రియాంకగాంధీ తన భర్త రాబర్ట్‌ వాద్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసలైన ప్రత్యర్థి ఏఏపీ అన్నారు. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి అజయ్ మాకెన్‌ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

 Will Take Full Responsibility for Delhi Results: Kiran Bedi

బీజేపీ గెలుపోటములకు తనదే పూర్తి బాధ్యత అని కిరణ్ బేడీ చెప్పారు. ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్‌ ఆధారంగానే ఉన్నాయని, 3 నుంచి 6 గంటల వరకు జరిగిన పోలింగ్‌ను అవి విస్మరించాయన్నారు.

బీజేపీ గెలుపునకు ఇదే కీలకంగా మారుతుందన్నారు. ఈ ఎన్నికల్లో మత రాజకీయాలను వ్యతిరేకించిన ఓటర్లకు కేజ్రీవాల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ పూర్తి మెజారిటీ సాధిస్తుందన్న విశ్వాసాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఈసారి స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్న ఆశాభావాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌ వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+