Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మోడీ టీంలోఅశోక్, టిడిపికి 2లేదా3: సుజనకి సహాయం

న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చే పదవులు ఎన్నో దాదాపు తేలిపోయింది. భాగస్వామ్య పక్షాల్లో ప్రతి ఐదుగురు ఎంపీలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని మోడీ భావిస్తున్నారట. ఆ లెక్కన టిడిపికి మూడు పదవులు వచ్చే అవకాశముంది. మూడు కాకపోయినా రెండు పదువులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నెల 26వ తేదీన మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తనతో పాటు చాలా తక్కువ మంది మంత్రులను ప్రభుత్వంలోకి తీసుకుంటున్నట్లు తెలిసింది.

టిడిపికి ఒక కేబినెట్ మంత్రి పదవిని, ఒకటి లేదా రెండు సహాయ మంత్రి పదవిని కేటాయించినట్లు సమాచారం. సీనియర్ నాయకుడు అశోక గజప తిరాజుకు కేబినెట్, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సహాయ మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మొదట ఓ కేబినెట్ పదవి, ఓ సహాయమంత్రి పదవి ఇస్తారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరపనున్నారు.

Narendra Modi

అప్పుడు తెలుగుదేశం పార్టీకి మరో ఒకటి లేదా రెండు పదవులు కేటాయించే అవకాశాలున్నాయి. అందులో ఒకటి కేబినెట్ మంత్రి పదవి ఉండాలని టిడిపి ఎంపీలు పట్టుబడుతున్నారు. విస్తరణ తర్వాత ఇచ్చే రెండింటిలో ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి అయితేనే బాగుంటుందని, కొత్త రాష్ట్రానికి పనులు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని టిడిపి భావిస్తోంది.

ఇదిలా ఉండగా శనివారం సాయంత్రం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు తొలుత తన సన్నిహిత మిత్రుడితో భేటీ అయ్యారు. అనంతరం బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్ నివాసానికి వెళ్లారు. దాదాపు అర గంటపాటు చర్చలు జరిపారు. ఆ తర్వాత అకాలీదళ్ ఎంపీ నరేశ్ గుజ్రాల్ నివాసంలో విందుకు హాజరయ్యారు. బిజెపి నాయకులు ప్రకాశ్ జవదేకర్, పియూశ్ గోయల్, టిడిపి నేత కంభంపాటి రామ్మోహన్‌లు కూడా ఈ విందులో పాల్గొన్నారు. కాగా, కేబినెట్ బెర్త్ల్ విషయమై మోడీని చంద్రబాబు కలిసే అవకాశముంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+