ఎన్నికలు: జయలలిత 'చిత్రం', డిఎంకె కౌంటర్ (పిక్చర్స్)

చెన్నై: ఎన్నికల నేపథ్యంలో తమిళ ఓటర్లను ఆకర్షించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత హీరోయిన్‌గా నటించిన చిత్రం తెర ముందుకు వచ్చింది. 1965లో జయలలిత కథానాయికగా నటించిన 'ఆయిరతిల్ ఒరువన్' అనే సినిమా సరికొత్తగా థియేటర్ల ముందుకు వచ్చింది.

డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య తమిళనాడులో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ విభేదాలు. ఈ పార్టీలు ఎప్పుడు ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటాయి. పార్టీ ప్రచారంలో భాగంగా జయలలిత పోస్టర్లు ఇబ్బడిముబ్బడిగా గోడలకెక్కాయి. దీనిని ఈసి సీరియస్‌గా పరిగణించింది.

దీంతో అన్నాడిఎంకె సరికొత్త వ్యాహానికి తెర తీసింది. ఎంజిఆర్, జయలలిత కలిసి నటించిన ఈ సినిమా పోస్టర్లతో రాష్ట్రాన్ని ముంచెత్తింది. పనిలో పనిగా ఆ సినిమాను డిజిటలైజేషన్ కూడా చేసి విడుదల చేసింది. ఆ సినిమాకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోంది.

జయలలిత

జయలలిత

ఎన్నికల నేపథ్యంలో తమిళ ఓటర్లను ఆకర్షించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత హీరోయిన్‌గా నటించిన చిత్రం తెర ముందుకు వచ్చింది. 1965లో జయలలిత కథానాయికగా నటించిన 'ఆయిరతిల్ ఒరువన్' అనే సినిమా సరికొత్తగా థియేటర్ల ముందుకు వచ్చింది.

జయలలిత

జయలలిత

డిఎంకె, అన్నాడిఎంకెల మధ్య తమిళనాడులో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ విభేదాలు. ఈ పార్టీలు ఎప్పుడు ఎత్తులు, పైఎత్తులు వేస్తుంటాయి. పార్టీ ప్రచారంలో భాగంగా జయలలిత పోస్టర్లు ఇబ్బడిముబ్బడిగా గోడలకెక్కాయి. దీనిని ఈసి సీరియస్‌గా పరిగణించింది.

జయలలిత

జయలలిత

దీంతో అన్నాడిఎంకె సరికొత్త వ్యాహానికి తెర తీసింది. ఎంజిఆర్, జయలలిత కలిసి నటించిన ఈ సినిమా పోస్టర్లతో రాష్ట్రాన్ని ముంచెత్తింది. పనిలో పనిగా ఆ సినిమాను డిజిటలైజేషన్ కూడా చేసి విడుదల చేసింది. ఆ సినిమాకు ఇప్పటికీ ఆదరణ లభిస్తోంది.

జయలలిత

జయలలిత

ఎంజిఆర్, జయలలితల పోస్టర్లకు, కటౌట్లకు క్షీరాభిషేకాలు చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల పోస్టర్లపై ఆంక్షలు విధించిన అధికారులు... సినిమా పోస్టర్లను అడ్డుకోవడంపై తర్జన భర్జన పడుతున్నారు.

జయలలిత

జయలలిత

ఈ సినిమాకు ఎనలేని ఆదరణ రావడంతో డిఎంకు ఉలిక్కిపడింది. ఆలస్యంగా తేరుకుంది. ఈ సినిమా షూటింగు సమయంలో ఎంజిఆర్‌తో తమ పార్టీ అదినేత కురణానిధి నవ్వుతూ మాట్లాడుతున్న ఫోటోను విడుదల చేసింది.

జయలలిత

జయలలిత

డిఎంకె అధినేత ఫేస్‌బుక్‌లో ఈ ఫోటో దర్శనమిస్తోంది. ఆ సినిమా విడుదలలో తమ నేత హస్తం కూడా ఉందంటూ డిఎంకె వర్గాలు ప్రచారం చేసుకుంటున్నాయి.

 జయలలిత

జయలలిత

ఈ సినిమాను వారం క్రితం విడుదల చేశారు. అంతకుముందే పోస్టర్లు వేశారు. అందులో ఎంజిఆర్ రెండు చేతుల నడుమ... వయ్యారాలు పోతున్న జయలలిత పోస్టర్లు వెలిశాయి. దీనిపై ఎలక్షన్ కమిషన్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

జయలలిత

జయలలిత

చిత్రం విడుదలను తాము అడ్డుకోలేమని, పోస్టర్లు మాత్రం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

జయలలిత

జయలలిత

నిజానికి ఇది అప్పట్లో 35ఎంఎం చిత్రం కాగా, ఇప్పుడు సినిమా స్కోప్‌‍లోకి మార్చారు. ఈ నెల 14న తమిళనాడు, కర్ణాటక వ్యాప్తంగా విడుదల అయింది.

జయలలిత

జయలలిత

అయితే, ఈ 'ఆయిరతిల్ ఒరువన్' సినిమా విడుదలలో రాజకీయ ప్రయోజనాలు లేవని దివ్య ఫిలింస్ అధినేత చెప్పారు. మొత్తానికి ఎన్నికల నేపథ్యంలో తమిళనాట ఆసక్తికర రాజకీయం కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+