వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షా వ్యూహం, ఏపీకి రూఢీ: టార్గెట్ జయ, బాబు కూడా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూఢీని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల ఇంఛార్జిగా నియమించారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా మిగతా రాష్ట్రాల పైన దృష్టి సారిస్తున్నారు.

ఇందులో భాగంగా ఇప్పటికే ఆయన పశ్చిమ బెంగాల్, బీహార్, జమ్ము కాశ్మీర్ తదితర రాష్ట్రాల పైన అమిత్ షా కన్నేశారు. మంగళవారం పలు రాష్ట్రాలకు ఇంఛార్జిలను నియమించారు. ఇప్పటి వరకు రాజీవ్ ప్రతాప్ రూఢీ మహారాష్ట్ర ఇంఛార్జిగా ఉన్నారు. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది.

ఇప్పుడు రూఢీని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఇంఛార్జిగా నియమించారు. తమిళనాడు పైన బీజేపీ ప్రత్యేక దృష్టి సారిస్తున్న విషయం తెలిసిందే. డీఎంకే పార్టీ ప్రభావం అంతగా లేకపోవడం, జయలలితకు కోర్టు చిక్కులు ఉన్న నేపథ్యంలో బీజేపీ తమిళనాడులో బలోపేతం అయ్యేందుకు పావులు కదుపుతోంది.

With Maha win, Rudy is AP incharge

ఇందుకోసం సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళ హీరో విజయ్, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ తదితరుల ద్వారా పార్టీని బలపర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తమిళనాడు పైన దృష్టి సారించిన బీజేపీ ఇప్పుడు.. మహారాష్ట్రలో పార్టీని గెలుపుబాటలో పయనింపజేసిన రూఢీకి పగ్గాలు అప్పగించడం గమనార్హం.

వచ్చే ఎన్నికల నాటికి తమిళనాడులో అధికార పార్టీకి ధీటుగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలలో అధికార పార్టీలతో పోటీ పడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. తమిళనాడులో పార్టీ బలోపేతం కోసం బీజేపీ రూఢీకి పగ్గాలు అప్పగించింది.

అదే రూఢీకి ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను కూడా అప్పగించింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేశాయి. కేంద్రంలో టీడీపీ ఎంపీలు మంత్రులుగా ఉన్నారు. అలాగే చంద్రబాబు కేబినెట్లో బీజేపీ నేతలు మంత్రులుగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో రూఢీకి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని, ఆ మేరకు కృషి చేయాలని రాష్ట్ర నేతలకు సూచించిన బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా.. ఇంఛార్జీల నియామకంలో రూఢీని ఏపీకి నియమించడం ద్వారా తన మనోగతాన్ని మరోసారి వెల్లడించారంటున్నారు.

English summary
The BJP's national president and master strategist Amit Shah's trusted lieutenant in the Maharashtra elections, Rajiv Pratap Rudy, has been made incharge of AP and Tamil Nadu affairs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X