కామంతో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది

ముజఫర్ నగర్: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ముజఫర్ నగర్ జిల్లాలోని ఘాసీపురా గ్రామంలో నివాసం ఉంటున్న షహీదా అనే మహిళను అరెస్టు చేశారు.

మహమ్మద్ యూసుఫ్, షహీదా దంపతులు. జీవనోపాధి కోసం మహమ్మద్ యూసుఫ్ ఓ డిస్టలరీలో పని చేస్తున్నాడు. షహీదా సందీప్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం సాగిస్తున్నది. భర్త లేని సమయంలో ఇంటిలోనే వీరు కలుసుకునేవారు.

ఈ విషయం మహమ్మద్ యూసఫ్ కు తెలియడంతో భార్య షహీదాను మందలించాడు. బుద్ధిగా ఉండాలని భార్యకు సూచించాడు. తన భర్త ఉన్నంత వరకు ప్రియుడితో కలిసి హాయిగా జీవించలేనని షహీదా తెలుసుకుంది.

Woman arrested for her husband’s murder case in Uttar Pradesh

ప్రియుడు సందీప్ తో కలిసి భర్తను హత్య చెయ్యాలని ప్లాన్ వేసింది. నిద్రపోతున్న భర్త గొంతును టవల్, తాడుతో బిగించి దారుణంగా హత్య చేశారు. తరువాత తన భర్త అనారోగ్యంతో మరణించాడని బంధువులను నమ్మించడానికి ప్రయత్నించింది.

వారికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహమ్మద్ యూసుఫ్ హత్యకు గురైనాడని వైద్యులు చెప్పారు. పోలీసులు షహీదాను అరెస్టు చేశారు. పరారైన ఆమె ప్రియుడు సందీప్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+