రేప్‌కు సహకరించలేదని చితకబాదారు, బాధితురాలిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

ముజఫర్‌నగర్: ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో వివాహితపై గ్యాంగ్‌రేప్‌కు ప్రయత్నించారు నలుగురు వ్యక్తులు. అయితే గ్యాంగ్‌రేప్ బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ఉత్తరప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై నలుగురు దుండగులు గ్యాంగ్‌ రేప్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళ వారిని అడ్డుకునే యత్నం చేసింది.

Woman attacked as she resists rape bid by four, dies

ఈ క్రమంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందింది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని శామ్లి జిల్లాలోని భూర గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యువతి(23) రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నలుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఆమై అత్యాచారం చేయడానికి ప్రయత్నించారు.

దీంతో ఆమె వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. కోపోద్రిక్తులైన దుండగులు ఆమెపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా.... మార్గమద్యలోనే చనిపోయింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
23-year-old woman has died allegedly after she was attacked by four people for resisting their attempt to rape her at her house in the Shamli district, police said on Monday. They said the alleged incident took place on Sunday, when the woman was alone at her home in the Bhura village which falls under the Kairana Police Station.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి