సతిగా అనుమానం: భర్త చితిలో కాలి బూడిదైన భార్య
ముంబై: సతీ సహగమనాన్ని తలపించే సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మరణించిన భర్త చితికి నిప్పంటించిన తర్వాత కనిపించకుండా పోయిన భార్య భర్తతో పాటు చితిలో కాలి బూడిదై పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూరు జిల్లాలో గల లహోటా గ్రామంలో చోటు చేసుకుంది.
అయితే, ఆమె భర్తతో సతీసహగమనానికి పాల్పడే విధంగా కుటుంబ సభ్యులు ప్రేరేపించారా అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. తుకారాం (55) అనే వ్యక్తి గుండెపోటుతో ఆదివారం సాయంత్రం మరణించాడు. పోలీసులు కూడా ఆ మరణాన్ని ధ్రువీకరించారు.

సోమవారం సాయంత్రం అతని మృతదేహానికి అంత్యక్రియలు జరిగాయి. కానీ, అదే రోజు తుకారాం భార్య (50) కనిపించకుండా పోయింది. మర్నాడు తుకారాం ఛితాభస్మాన్ని తీసుకునేందుకు కుటుంబ సభ్యులు స్మశానానికి వెళ్లగా అక్కడే ఉష కూడా కాలిపోయి ఉన్నట్లు గుర్తించారు.
మృతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు మాత్రం కుటుంబ సభ్యులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సతీసహగమనాన్ని భారత దేశంలో నిషేధించిన విషయం తెలసిందే. ఉష మరణాన్ని ఆకస్మిక మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications