కలలోకి వచ్చి రేప్ చేస్తుండు.. మాంత్రికుడిపై వివాహిత కంప్లైంట్..
విచిత్రాలు, వింతలు, విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. కల రావడం సహజం.. కానీ అందులో లైంగికదాడి చేయడం అనేది కాస్త విడ్డూరం. కానీ ఓ మాంత్రికుడు కలలోకి వచ్చిన రేప్ చేస్తున్నాడని వివాహిత వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. విచారించిన పోలీసులు.. ఆధారాలు లభించకపోవడంతో మూసివేశారు.
మాంత్రికుడు కలలోకి వచ్చి లైంగికదాడి అచేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన బీహార్‌లో జరిగింది. ఔరంగాబాద్ జిల్లా, కుద్వ పోలీస్ స్టేషన్ పరిథిలోని గాంధీ మైదాన్ ప్రాంతంలో మహిళ ఉంటుంది. కుమారుడికి అనారోగ్యంగా ఉండటంతో గత జనవరిలో ప్రశాంత్ చతుర్వేది అనే మాంత్రికుడిని ఆశ్రయించింది. సదరు మాంత్రికుడు మహిళ కుమారుడి ఆరోగ్యం కోసం కొన్ని పూజలు నిర్వహించాడు.

15 రోజుల తర్వాత బాలుడు చనిపోయాడు. కుమారుడి మరణం తర్వాత ఆమె ప్రశాంత్ ఉంటున్న కాళీ బరి ఆలయానికి వెళ్లింది. తన కుమారుడు ఎందుకు మరణించాడో చెప్పాలని నిలదీసింది. ఈ క్రమంలో అతను ఆమెపై అత్యాచారం చేయబోగా.. చనిపోయిన ఆమె కుమారుడు అడ్డుకున్నాడట. ఇక అప్పటినుంచి ప్రశాంత్ రాత్రిళ్లు ఆమె కలలోకి వచ్చి అత్యాచారం చేసేవాడట. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఘటనపై ప్రశాంత్‌ను విచారించగా.. ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపాడేశాడు. ఆమెను ఎప్పుడూ కలుసుకోలేదని విచారణలో తెలిపాడు. నిందితుడికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లభించకపోవటంతో పోలీసులు సంతకం చేయించుకుని వదిలేశారు. కానీ ఇదేం కేసురా బాబు అని తలలు పట్టుకున్నారు. తొలుత విన్నా.. కేసు రాసే సమయంలో కూడా రైటర్ పరిస్థితి మాములుగా లేదు. విచారణ పర్వంలో నిజ నిజాలు తెలుసుకుని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications