భార్యతో గొడవపడి ఎంత పని చేశాడు
చెన్నై: భార్యతో గొడవ పడిన వ్యక్తి మూడు అంతస్తుల భవనం మీద నుంచి కిందకు దూకాడు. అయితే అతను ప్రాణాలతో బయటపడి ఓ అమాయకురాలిని చంపేశాడు. చెన్నైలోని నల్లన్ కుప్పంలో చల్ల గాలి కోసం కింద మంచం మీద పడుకున్న శారద (75) అనే వృద్దురాలు బలి అయ్యింది.
వృద్దురాలి మృతికి కారణం అయిన సెల్వమురుగన్ (37) అనే వ్యక్తి మీద కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. సెల్వమురుగన్, ధనలక్ష్మి దంపతులు. సెల్వమురగన్ చెన్నైలో ఆటో డ్రైవర్.
నిత్యం మద్యం సేవించి ఇంటికి వెళ్లి భార్య ధనలక్ష్మితో పాటు బావమరిదితో గొడవపడేవాడు.
భార్య ధనలక్ష్మి వేధింపులు తట్టుకోలేక అతను తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి 30 అడుగుల ఎత్తు ఉన్న మూడు అంతస్తుల భవనం మీదకు వెళ్లాడు.

తరువాత అక్కడి నుంచి కిందకు దూకాడు. అయితే కిందపడుకుని ఉన్న శారద మీద పడటంతో ఆమె ప్రాణాలు పోయాయని పోలీసులు చెప్పారు. సెల్వమురగన్ తల, కాళ్లకు గాయాలు కావడంతో అతనిని రాజీవ్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.
నిత్యం ఆత్మహత్య చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పేవాడని, అందుకే వారు పెద్దగా పట్టించుకోలేదని పోలీసులు అన్నారు. మద్యం మత్తులోనే సెల్వమురుగన్ కిందకు దూకాడని కేసు నమోదు చేశామని చెన్నై పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications