వేధింపులు: టెరీకి బాధిత ఉద్యోగిని రాజీనామా

న్యూఢిల్లీ: ఇంధన, వనరుల పరిశోధన సంస్థ(టెరీ) తన పట్ల అత్యంత దారుణంగా వ్యవహరించిందని.. సంస్థ మాజీ డైరెక్టర్‌ జనరల్‌(డిజి) ఆర్‌కె పచౌరీపై లైంగిక వేధింపుల విషయంలో ఫిర్యాదు చేసిన మహిళ ఆరోపించారు.

వృత్తిపరంగా, ఆర్థికంగా, మానసికంగా టెరీ తనను ఇబ్బందులకు గురిచేసిందని ఆమె తెలిపారు. సంస్థ మానవ వనరుల నిర్వాహకులు దినేష్‌ వర్మకు ఆమె తన రాజీనామా లేఖను పంపారు. పచౌరీని విచారణ కమిటీ దోషిగా నిర్ధారించినా.. తన పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లేఖలో ఆమె పేర్కొన్నారు.

Woman employee who accused RK Pachauri of sexual harassment quits TERI

తనను అసాధారణ రీతిలో గాలికి వదిలేశారని చెప్పారు. పచౌరీకి మాత్రం పూర్తి సంరక్షణ కల్పించారని వివరించారు. రెండేళ్ల పాటు పచౌరీ తనను లైంగిక వేధించాడని బాధితురాలు ఆరోపించింది.

పచౌరీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆమె ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆమె ఆరోపణలన్నీ అవాస్తవం, నిరాధారమైనవని టెరీ కొట్టిపారేసింది. తామెప్పుడూ పూర్తి నిష్పాక్షికత, పారదర్శకతతో వ్యవహరించినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

అయితే, ఆరోపణల నేపథ్యంలో సంస్థ చీఫ్ పదవి నుంచి ప్రపంచ ప్రఖ్యాత పర్యావరణవేత్త ఆర్‌కే పచౌరీపై వేటు పడింది. ఆ పదవి నుంచి ఆయనను తొలగించారు. పచౌరీ తన పదవిని దుర్వినియోగపరిచాడని అంతర్గత విచారణలో తేలింది. లైంగిక వేధింపుల విషయంలో సంస్థ నియమాలను ఆయన ఉల్లంఘించినట్లు తేల్చారు. ప్రస్తుతం పచౌరీ బెయిల్‌పై ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+