దారుణం: భర్తను కట్టిపడేసి భార్యపై గ్యాంగ్‌రేప్, ఐఫోన్ కోసం చిన్నారి హత్య

బదౌన్/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని బంధించిన నలుగురు యువకులు, అతని భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మహిళను సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. బాధిత మహిళ, ఆమె భర్త కలిసి శనివారం రాత్రి ఆస్పత్రికి వెళ్లి తిరిగి తమ గ్రామానికి వస్తుండగా నలుగురు యువకులు బైకులపై వచ్చి వారిని అడ్డగించారు. ఆ తర్వాత వారిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి బలవంతంగా లాక్కెళ్లారు.

అనంతరం ఆమె భర్తను తాళ్లతో కట్టిపడేసిన యువకులు, మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత అక్కడ్నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఎస్‌పి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ఆదివారం నిందితులలో ఇద్దర్ని అరెస్ట్ చేశామని, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన చెప్పారు.

 Woman gangraped by four, husband held hostage

ఐఫోన్ కోసం చిన్నారి హత్య

న్యూఢిల్లీ: ఐఫోన్ కోసం ఆరేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి.. అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంజిత్‌నగర్‌కు చెందని పండ్ల వ్యాపారి కుమారు గణేష్(6) గురువారం ఆడుకోవడానికి ఇంటి నుంచి బయటికెళ్లి తిరిగి రాలేదు. అతడ్ని కిడ్నాప్ చేశామని, రూ. 1.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే రోజు రాత్రి గణేష్ తండ్రికి ఫోన్ రావడంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.

కాగా, శుక్రవారం సాయంత్రం సత్యాపార్క్‌లో గణేష్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో చిన్నారి చివరిసారిగా ఎవరితో ఉన్నాడనే విషయం పరిశీలించగా.. అతని ఇంటికి సమీపంలో నివసిస్తున్న యువకుడి(17)తో ఆడుకున్నట్లు గుర్తించారు.

దీంతో యువకుడ్ని అతని తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రశ్నించగా.. తానే గణేష్‌ను హత్య చేసినట్లు అంగీకరించాడు. ఐఫోన్ కొనుగోలు చేయాలని, విలాసంగా జీవించేందుకే హత్యకు పాల్పడినట్లు వెల్లడించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+