ప్రియుడిపై మోజు: కుటుంబంలో చిచ్చు, తిరిగి భర్త వద్దకే!
బెంగుళూరు: ప్రియుడి వ్యామోహంలో పడిన ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలి వెళ్లింది. అయితే కొన్ని రోజులు తర్వాత ప్రియుడు ఆమెను మోసగించడంతో తిరిగి భర్త వద్దకే చేరిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో చోటు చేసుకుంది. తనతో కాపురం చేయని పక్షంలో భర్త డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోంది.
అయితే తనతో పాటు పిల్లలను వదిలి వెళ్లిన భార్యను స్వీకరించే ప్రసక్తే లేదని ఆమె భార్య భీష్మించుకు కూర్చున్నాడు. పోలీసుల వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. రశ్మి అలియాస్ లక్ష్మి, ఆమె భర్త శశిలు తమ పిల్లలతో కలిసి మండ్యలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో రశ్మికి ఎదురింట్లో నివాసం ఉంటోన్న సాగర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. ఈ బంధం మరింతగా బలపడటంతో రశ్మి భర్తను వదిలి సాగర్‌తో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం భర్త శశికి తెలియడంతో భార్యభార్తల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి.
దీంతో శశి ఈ విషయాన్ని తన బంధువులకు తెలియజేయడంతో రంగంలోకి దిగిన వారు సాగర్‌కు దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసుల సమక్షంలోనే తనకు భర్త శశితో ఉండడం ఇష్టం లేదని సాగర్‌ను పెళ్లి చేసుకొని అతనితోనే జీవిస్తానని రశ్మి చెప్పడంతో శశి కూడా అంగీకరించాడు.
ఇకపై రశ్మికి, తనకు సంబంధం లేదని శశి కూడా తేల్చిచెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత రశ్మి ప్రియుడు సాగర్ ఇంట్లో జరుగుతున్న పరిణామాలతో ఆమెను వదిలేసి పారిపోయాడు. దీంతో రశ్మి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏం చేయాలో తెలియక తిరిగి భర్త వద్దకే చేరుకుంది.
ఇకపై తన భర్తతోనే ఉంటానని, అందుకు ఆంగీకరించకపోతే ఆస్తిలో వాటా ఇవ్వాలని భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న శశి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వీరిద్దరిని కలిపేందుకు ప్రయత్నించినా.. తనను తన పిల్లను వదిలేసి వెళ్లిన రశ్మిని తిరిగి భార్యగా స్వీకరించేది లేదని శశి తేల్చిచెప్పాడు.












Click it and Unblock the Notifications