బెంగళూరు ఆంటీ చాలా ముదురు: రెచ్చగొడుతోంది, ఇంటికి రా అంటూ!

చెన్నై: చెన్నైలో ఒంటరిగా బస్సు, ఆటో కోసం వేచి ఉండే పురుషులను రెచ్చగొట్టి నిలువుదోపిడీ చేస్తున్న మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఇంత కాలం తప్పించుకుని తిరుగుతూ లూటీలు చేస్తున్న బెంగళూరు నివాసి ఆశా సౌందర్య (37) అనే మహిళను అరెస్టు చేశారు.

బెంగళూరులో నివాసం ఉంటున్న రవి అనే వ్యక్తిని అదే నగరానికి చెందిన ఆశా సౌందర్య వివాహం చేసుకుందని చెన్నైనగరంలోని టీ. నగర్ డిప్యూటీ కమిషనర్ శరవణన్ మీడియాకు చెప్పారు. అమె చేస్తున్న మోసాలు గురించి డిప్యూటీ కమిషనర్ శరవణన్ వివరించారు.

లేడీస్ హాస్టల్ లో మకాం !

లేడీస్ హాస్టల్ లో మకాం !

బెంగళూరు నుంచి చెన్నై చేరుకున్న ఆశా సౌందర్య ఓ లేడీస్ హాస్టల్ లో నివాసం ఉంటున్నది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం తన ఆక్టీవా స్కూటర్ లో బయటకు వస్తోంది. బస్ స్టాండ్ లు, రోడ్ల మీద ఒంటరిగా వెళ్తున్న పురుషులను పరిచయం చేసుకుంటోంది.

స్కూటర్ మీద జాలీగా !

స్కూటర్ మీద జాలీగా !

పరిచయం చేసుకున్న పురుషులకు మాయమాటలు చెప్పి సెక్సీ మాటలతో వారిని రెచ్చగొడుతోంది. నిన్ను మాఇంటికి పిలుచుకు వెళ్తానని, పని పూర్తి అయ్యాక మిమ్మల్ని తన స్కూటర్ లో మళ్లీ ఇక్కడే డ్రాప్ చేస్తానని నమ్మిస్తోంది. తరువాత ఆశా సౌందర్య పురుషులను తన స్కూటర్ మీద ఎక్కించుకుని చెన్నై నగరంలోని రోడ్ల మీద జాలీగా వెళ్తోంది.

నా మీద అక్కడ చెయ్యి వేస్తావా ?

నా మీద అక్కడ చెయ్యి వేస్తావా ?

నడి రోడ్డులో స్కూటర్ నిలిపివేస్తున్న ఆశా సౌందర్య తన వెంట స్కూటర్ లో వచ్చిన పురుషులతో గొడవ పెట్టుకుంటోంది. నా మీద అక్కడ చెయ్యి వస్తావా ? నన్ను గిల్లుతావా ? నన్ను అక్కడికి రమ్మంటావా అంటూ నడి రోడ్డు నానా హంగామా చేస్తోంది.

అసభ్యంగా ప్రవర్తించారని!

అసభ్యంగా ప్రవర్తించారని!

మర్యాదగా నగలు, నగదు ఇవ్వకుంటే నా మీద రేప్ చెయ్యడానికి ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని, జైలుకు పంపిస్తానని బెదిరిస్తోంది. మహిళతో అసభ్యంగా ప్రవర్తించారని కేసు నమోదు అయితే పరువు పోతోందని, జైలుకు వెళ్లాల్సి వస్తోందని ఆమె వలలో పడిన పురుషులు భయపడి పోయారు.

నగదు, నగలు లూటీ

నగదు, నగలు లూటీ

తన వెంట వచ్చిన పురుషులను ఇలా బెదిరించి బంగారు నగలు, నగదు లూటీ చేస్తోంది. చెన్నైలోని కోయంబేడు, వడపళని, అరంబాక్కం ప్రాంతాల్లో ఆశా సౌందర్య ఇలాగే రెచ్చిపోయింది. బాధితులు ఫిర్యాదు చెయ్యడంతో టీ. నగర్ డిప్యూటీ కమిషనర్ శరవణన్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆమె కోసం గాలించారు.

వలలో పడింది

వలలో పడింది

వడపళనిలోని సాయినగర్ బస్ స్టాండ్ దగ్గర ఒంటరిగా ఉన్న పురుషుడిని వలలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆశా సౌందర్యను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బెంగళూరుకు చెందిన ఆశా సౌందర్య లూటీ చేసిన 20 సవర్ల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నామని డిప్యూటీ కమిషనర్ శరవణన్ మీడియాకు చెప్పారు.

బెంగళూరు ఆంటీ పెద్ద ముదురు

బెంగళూరు ఆంటీ పెద్ద ముదురు

బెంగళూరుకు చెందిన ఆశా సౌందర్య చెన్నై నగరంలో నిత్యం ఇలా లూటీలు చెయ్యడంతో వరుసగా ఫిర్యాదులు రావడంతో అక్కడి పోలీసులకు పెద్ద తలనొప్పిగా తయారైయ్యింది. చివరికి సీసీ కెమెరాల్లో తన స్కూటర్‌పై పురుషులను ఎక్కించుకుని వెళ్తున్న ఆశా సౌందర్య ముఖం గుర్తించిన పోలీసులు అమెను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+