ప్రతీకారం: కోప్‌ను చంపిన సెక్స్ వర్కర్, హెచ్చరిక కోసం..
ముంబై: తనను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపాడనే కోపంతో ఓ మహిళ పోలీసును చంపింది. ఈ సంఘటన ముంబైలో జరిగింది. జుహు తారా రోడ్డు పైన దాదాపు నెల రోజుల క్రితం సగం కాలిన కానిస్టేబుల్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేసిన పోలీసులు.. ఓ సెక్స్ వర్కర్‌ను అరెస్టు చేశారు. హత్య చేసింది తానేనని 29 ఏళ్ల ఆ సెక్స్ వర్కర్ అంగీకరించింది.
తనను బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపినందుకే తాను ప్రతికారంగా అతనిని చంపేసినట్లు చెప్పింది. తనది బీహార్ అని, బాల్యం నుంచే సవతి తల్లి హింస పెట్టేదని, ఆ బాధలు భరించలేక 2002లో ముంబై వచ్చేశానని, తన వయసు 17 ఏళ్ళని తెలిపింది. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) రైల్వే స్టేషన్ బయట అలసటతో, ఆకలితో ఉన్న తనను ఓ మహిళ తన నివాసానికి తీసుకెళ్ళిందని, అయితే, ఆమె భర్త తనపట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి నుంచి తిరిగి సీఎస్టీకి వచ్చేశానని తెలిపింది.

అక్కడ ఓ కానిస్టేబుల్ కలిసి వసతి కల్పిస్తానని, ఉద్యోగం చూపిస్తానని నమ్మబలికి.. తనను ఓ వ్యభిచార గృహానికి అమ్మేశాడని, రెండేళ్ళ తర్వాత ఆ వ్యభిచార గృహ యజమానికి మత్తు ఇచ్చి తప్పించుకుని, బాంద్రా మురికివాడకు వచ్చేశానని తెలిపింది. అక్కడే ఓ చిన్న ఫ్యాక్టరీలో పనిలో చేరానని, అక్కడే పరిచయమైన ఒక వ్యక్తిని పెళ్ళాడానని, ఓ బాబు పుట్టాక అతను వదిలి వెళ్లాడని, దీంతో మళ్లీ వ్యభిచార వృత్తిలోకి దిగానని తెలిపింది.
ఓసారి తాను దొరికిపోయానని, ఆ పోలీసు బృందంలో తనను బ్రోతల్‌కు అమ్మిన కానిస్టేబుల్ కూడా ఉన్నాడని, అతడు తన ఫోన్ నెంబర్ తీసుకుని, తరచూ లైంగికంగా వేధించేవాడని చెప్పింది. ఆ వేధింపులు భరించలేక అతడిని చంపేయాలని నిర్ణయించుకుని, ఓ కస్టమర్ సాయంతో మత్తు మందు తెప్పించానని, సెప్టెంబర్ 12 రాత్రి కానిస్టేబుల్‌కు మత్తు మందు కలిపిన డ్రింక్ తాగించి, అతను స్పృహ కోల్పోగానే గొంతు నులిమి చంపేశానని తెలిపింది.
అయితే తాను కానిస్టేబుల్‌ను చంపిన విషయం అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మరుసటి రోజు ఆ శవాన్ని పరుపులో చుట్టి తగలబెట్టానని, కిరాతక కానిస్టేబుళ్ళకు ఆ హత్య ఓ హెచ్చరికలా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆ పని చేశానని తెలిపింది. ప్రస్తుతం ఆమె జ్యుడీషియల్ కస్టడీలో ఉంది.












Click it and Unblock the Notifications