అఫైర్: మహిళ భర్తను చంపి చెట్టుకు వేలాడదీసింది

హత్యలో అమెకు సహకరించిన ఆమె కజిన్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త విషయంపై పోలీసులను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేసిన కమల అనే ఆ మహిళ ఆ తర్వాత బోరున ఏడ్చేసి వాస్తవాన్ని అంగీకరించింది.
రాజ్‌కుమార్ అనే 35 ఏళ్ల వ్యక్తిని గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. ఆ చెట్టు రాజ్‌కుమార్ ఇంటి ఆవరణలోనే ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధాలు సరిగా లేవని పోలీసులు అంటున్నారు. తాగి వచ్చి ప్రతి రోజూ ఆమెను కొడుతూ ఉండేవాడని అంటున్నారు.
సోమవారంనాడు బాగా తాగి వచ్చిన రాజ్‌కుమార్ భార్యను కొట్టాడు. దాంతో ఎదురు తిరిగి ఆమె అతన్ని చంపేసింది. చెట్టుకు వేలాడదీయడంలో పుష్పేంద్ర తనకు సహకరించినట్లు కమల చెప్పింది. పుష్పేంద్రతో సంబంధం వల్లనే కమల ఈ హత్యకు పాల్పడిందని రాజ్‌కుమార్ బంధువులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications