నీ సోదరుడితో పడుకో, లేదంటే గ్యాంగ్ రేప్ చేయిస్తా: భార్యతో భర్త, చివరకు...

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: తన భార్య పట్ల ఓ భర్త అమానుషంగా ప్రవర్తించాడు. మగ పిల్లాడి కోసం ఆమెను చేయకూడని పని చేయమన్నాడు. దాంతో అతన్ని భార్య మట్టుబెట్టింది. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. తన వ్యాపారం ముందుకు సాగడానికి తనకు వారసుడు కావాలని, అందుకు నీ సోదరుడితో పడుకోవాలని, ఆ లైంగిక క్రీడను తాను చూస్తుంటానని ఓ భర్త భార్యను బలవంత పెట్టాడు.

దాంతో ఆమె భర్తను చంపేసింది. ఆ ఘటనలో పోలీసులు ఆమెను, ఆమె సోదరుడిని అరెస్టు చేశారు. భర్త సూచనను ఆమె ప్రతిఘటించింది. దాంతో అతను తీవ్రంగా ఆగ్రహించి - నిన్న గ్యాంగ్ రేప్ చేయిస్తానని, బ్రోతల్‌కు అమ్మేస్తానని బెదిరించాడు.

Woman kills husband who forced her to sleep with her brother for a male child

అప్పటికే వారికి ఓ కూతురు ఉంది. అయితే, ఆ తర్వాత పలుమార్లు భార్య గర్భం దాల్చినప్పటికీ అబార్షన్ చేయించాడు. దాంతో తాను విసిగిపోయానని, సహనం చచ్చిపోయి అతన్ని చంపడానికి పథకం వేశానని ఆమె చెప్పింది. ఆదివారం రాత్రి అతని ఆహారంలో మత్తు మందు కలిపింది. అది తిన్న తర్వాత నిద్రపోయిన భర్తను గొంతు నులిమి చంపింది.

మర్నాడు పోలీసులను పిలిచి తన భర్త హత్యకు గురయ్యాడని చెప్పింది. తన భర్తను హత్య చేశాడని చెప్పి ఆ మహిళ ఏడుస్తూ ఉండిపోయిందని, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఓ కట్టుకథ అల్లిందని పోలీసులు చెబుతున్నారు. రాత్రి ఇద్దరు అతిథులు వచ్చారని, వారు పార్టీ చేసుకున్న తర్వాత ఒకే గదిలో పడుకున్నారని, తాను మరో గదిలో పడుకున్నానని చెప్పింది.

మర్నాడు ఉదయం లేచేసరికి గది వెలుపల తాళం వేసి ఉందని, తలుపు తెరిచి చూసే సరికి తన భర్త శవం పడకపై పడి ఉందని, అతిథులు కనిపించలేదని ఆమె చెప్పినట్లు దర్యాప్తు అధికారి చెప్పారని హిందూస్తాన్ టైమ్స్ పత్రిక రాసింది.

దాంతో పోలీసులు అతిథుల కోసం గాలిస్తూ వచ్చారు. కానీ ఏ విధమైన ఆధారాలు లభించలేదు. దర్యాప్తులో భాగంగా ఓ సిసిటీవీ ఫుటేజీని కనిపెట్టారు. తెల్లవారు జామున 3 గంటలకు ఓ వ్యక్తి కుంటుతూ ఆ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్తూ కనిపించాడని పోలీసులు చెప్పారు. అతన్ని ఆ మహిళ సోదరుడిగా గుర్తించారు.

దాంతో పోలీసులు మహిళను, ఆమె సోదరుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో ఆమె నేరాన్ని అంగీకరించి, భర్తతో తనకు గల సంబంధాన్ని వివరించింది. అతనితో తనకు 18 ఏళ్ల క్రితం వివాహమైందని, కొద్ది సంవత్సరాల తర్వాత తనకు కొడుకు కావాలని పట్టుబడుతూ వచ్చాడని, తనకు కూతురు పుట్టిందని, నాలుగేళ్ల తర్వాత ఆమె మరణించిందని, ఆ తర్వాత తనకు పలుమార్లు అబార్షన్ చేయించాడని ఆమె చెప్పింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman killed her husband as he forced her to get intimate with her brother and used to ‘supervise’ the act because he wanted a son to take the lineage and his family business forward.
Please Wait while comments are loading...