దారుణం: భూమి ఇవ్వలేదని మహిళను వివస్త్రను చేసి, కర్రలతో కొట్టారు
పాల్‌ఘర్: మహరాష్ట్రలోని పాల్‌ఘర్ జిల్లా దండిపడా గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భూమి అభివృద్ధి పనులు తమకు అప్పగించలేదని ఓ మహిళ(45)ను ఐదారుగురు దుండగులు నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి తీవ్రంగా కొట్టారు.
అంతటితో ఆగని దుర్మార్గులు ఆమెను వివస్త్రను చేసి లైంగికంగా వేధించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ దురాగతానికి పాల్పడిన వారిలో ప్రధాన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ ఆరునెలల క్రితం నరేశ్ ధోడి అనే వ్యక్తి నుంచి కొంత భూమి కొనుగోలు చేసింది. సదరు భూమి అభివృద్ధి పనిని తనకే ఇవ్వాల్సిందిగా అతను ఆమెను వేధిస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం ధోడి కొంతమందితో కలిసి ఆమెను ఇంట్లోంచి జుట్టుపట్టుకొని రోడ్డుపైకి ఈడ్చుకొచ్చి కర్రలతో తీవ్రంగా కొట్టాడు.
అనంతరం ఆమెను వివస్త్రను చేసి లైంగికంగా వేధించాడు. ఈ ఘటనపై బుధవారం బాధితురాలు ఫిర్యాదు చేసిందని, ప్రధాన నిందితుడు ధోడిని అదుపులోకి తీసుకున్నామని స్థానిక పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications