మాజీ సీఎం కొడుకు, సినిమా హీరో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో, మహిళల చివాట్లు !
బెంగళూరు/రామనగర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా ప్రజల నుంచి రాజకీయ నాయకులకు నిరసన సెగ మొదలైయ్యింది. మీరు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఐదు ఏళ్లలో మాకు మీరు ఏం చేశారు ?. కనీసం తాగడానికి మంచి నీళ్లుకూడా లేవు, ఇప్పుడు ఓట్లు అడగడానికి వస్తారా అంటూ మాజీ సీఎం కొడుకు, సినిమా హీరోకు మహిళా ఓటర్లు చివాట్లు పెట్టి చూక్కలు చూపించడం కలకలం రేపింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్, జేడీఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. అభ్యర్థుల పేర్లు ప్రకటించకపోవడంతో బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నారు. జేడీఎస్ కు కంచుకోట అయిన రామనగరలో ఆ పార్టీ తరపున ప్రచారం చెయ్యడానికి మాజీ సీఎం హెచ్ డీ. కుమారస్వామి కుమారుడు, సినిమా హీరో నిఖిల్ కుమారస్వామి వెళ్లారు.

గ్రామంలోకి ఎంట్రీ ఇచ్చిన మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, సినిమా హీరో నిఖిల్ కుమారస్వామికి స్థానిక మహిళల నుంచి ఊహించిన ఎదురు దెబ్బ తగిలింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నాయనా, మేము బతికే ఉన్నామా ?, లేదా ? అని చూడటానికి వచ్చారా ?, ఐదు ఏళ్లకు ఒకసారి ఎన్నికల సమయంలో మాత్రమే మేము మీకు గుర్తుకు వస్తామా ? అంటూ గ్రామస్తులు నిఖిల్ కుమారస్వామి మీద మండిపడ్డారు.
కర్ణాటకలోని రామనగర నియోజక వర్గంలోని హారోహళ్లి తాలుకాలోని బాదగెరగె గ్రామంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి వెళ్లిన ఆ నియోజక వర్గం జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ కుమారస్వామికి ఊహించని ఎదురుదెబ్బ తగలడంతో జేడీఎస్ నాయకులు ఉలిక్కిపడ్డారు. ఈ నియోజక వర్గం ఎమ్మెల్యే మరో ఎవరో కాదు, నిఖిల్ కుమారస్వామి తల్లి, మాజీ సీఎం హెచ్ డీ, కుమారస్వామి భార్య అనితా కుమారస్వామి కావడం విశేషం.
మా గ్రామంలో తాగునీరు అందడం లేదు, సరైన రోడ్లు లేవు, డ్రైనేజ్ లు పాడైపోయి మురికినీరు రోడ్ల మీదకు వస్తున్నాయి. ఐదు సంవత్సరాల్లో మా గ్రామంలో ఒక్కరూపాయి పని కూడా జరగలేదు, ఇప్పుడు మాత్రం ఊపుకుంటూ ఓట్లు అడగడానికి వస్తున్నారా ? అంటూ నిఖిల్ కుమారస్వామి, జేడీఎస్ నాయకుల మీద గ్రామంలోని మహిళలు విరుచుకుపడ్డారు.
మీ పార్టీ నాయకులే కాదు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మా గ్రామంలోకి రాకూడదని ఆ గ్రామంలోని మహిళలు తేల్చి చెప్పారు. ఎన్నకలు పూర్తి అయిన తరువాత మీ సమస్యలు అన్ని పరిష్కరిస్తామని నిఖిల్ కుమారస్వామి మహిళలకు సర్దిచెప్పడానికి ప్రయత్నించినా మహిళలు మాత్రం వారి మాట వినలేదు, ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటనను స్థానిక గ్రామంలోని యువకులు మొబైల్స్ లో వీడియోలు తీసి ఆ వీడియోలు సోమవారం రాత్రి సోషల్ మీడియాలో పోస్టు చెమ్యడంతో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications