ఆమెకు 32 అతనికి 24: 14 సార్లు పోడిచి చంపేశాడు
జైపూర్: వయస్సు ఎక్కువ తక్కువ అనే చిన్న విషయంలో గొడవపడి భర్త చేతిలో భార్య అతిదారుణంగా హత్యకు గురైన సంఘటన జైపూర్ లో జరిగింది. భార్య తల మీద కర్రతో కొట్టిందని కసితీర కత్తితో పోడిచి చంపేశాడు. తలకు తీవ్రగాయం కావడంతో అతను జైపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రాజస్థాన్ లోని టాంక్ నగరంలో ఆసీఫ్ (24), షమీమ్ బానో (32) దంపతులు నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల కారణంగా వీరు నిత్యం గొడవ పడేవారు. అంతే కాకుండ ఇద్దరి మద్య వయస్సు తేడా ఉండటంతో గొడవ చేసుకునేవారు.

సోమవారం దంపతులు ఇంటిలో గొడవపడ్డారు. తరువాత షమీమ్ కర్ర తీసుకుని భర్త తలమీద కొట్టింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన ఆసీఫ్ ఇంటిలో వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని భార్య షమీమ్ శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ కసితీరా పొడిచాడు. 14 సార్లు కత్తితో దాడి చెయ్యడంతో రక్తం ఎక్కవ పోయింది.
ఆసీఫ్ తలకు గాయం కావడంతో ఇద్దరిని జైపూర్ లోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే షమీమ్ మరణించిదని వైద్యులు నిర్దారించారు. ఆసీఫ్ అదే ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నాడని కేసు దర్యాప్తులో ఉందని టాంక్ సిటి పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications