మోడీ ప్రభుత్వంలో ‘జాప్యం’ను డిలీట్ చేశాం: జవదేకర్
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ‘జాప్యం' అనే పదాన్నే తొలగించినట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు. ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో పనులను వేగంగా నిర్వర్తిస్తామని తెలిపారు. ఇంతకుముందు ఒక దస్త్రం నాలుగు నెలల పాటు పెండింగ్‌లో ఉండేదని, కొత్త ప్రభుత్వ హయాంలో దాన్ని నాలుగు వారాలు కూడా ఉంచబోమని చెప్పారు.
మౌలిక వసతుల ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతుల్లో జాప్యం జరుగుతోందని పరిశ్రమలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మోడీ ప్రభుత్వంలో జాప్యానికి తావులేదని, ఆ పదాన్ని తొలగించినట్లు ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వం హానికర రహిత అభివృద్ధికి తోడ్పాటునందిస్తుందని తెలిపారు. తమ విధానాలలో స్పష్టత ఉంటుందని, కాల పరిమితితో పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
దూరదర్శన్ ప్రసారాలను మరింత నాణ్యతగా రూపొందించి ప్రజలందరూ తిలకించేందే విధంగా అభివృద్ధి చేస్తామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం నెలకొన్న ఈ పోటీ వాతావరణంలో దూరదర్శన్ ఛానల్‌ను ప్రథమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications